శోకసద్రంలో వినోబా నగర్ సర్పంచ్ కుటుంబంన్ని పరామర్శించిన. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్. జూలూరుపాడు సెప్టెంబర్ 20: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక తెలుగు న్యూస్: జూలూరుపాడు మండలం పరిధిలో వినోబానగర్ గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్ కుటుంబంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ నవీన్ కుమార్తె చిన్నారి తన్విత(5సంవత్సరాలు) ఆడుకుంటూ కారులోకి వెళ్లి ప్రమాదవశాత్తు డోర్ లాక్ కావడంతో బయటకు రాలేకపోయింది. కొంత సమయం అనంతరం పాప కనిపించట్లేదని. వెతుకుతుండగా చిన్నారి కారులో ఉన్న విషయాన్ని కుటుంబీకులు గుర్తించి బయటకు తీసుకొచ్చారు.కారు లాక్ అవటం లాక్ అవ్వడం వల్ల ఎక్కువసేపు ఉండిపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల రోదనలు చిన్నారి మృతితో వినోబా నగర్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాంగిల నాయక్. కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి చూడడం నరసింహారావు. గ్రామస్థులు, కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతినీ తెలియజేశారు.

