ePaper
Monday, September 21, 2026
📄 ePaper

జూరాల వద్దకు వెళ్లకుండా బీఆర్‌ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్టు

📰 Generate e-Paper Clip

సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న ఆయకట్టు రైతులకు మద్దతుగా వెళ్లే ప్రయత్నంపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 2026: పెద్దమందడి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టు కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా వెళ్లేందుకు ప్రయత్నించిన పెద్దమందడి మండల బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దుల్లోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద సాగునీటి విడుదల కోసం ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. జూరాల ప్రాజెక్టు కాలువలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడుకునేందుకు వెంటనే కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించి, సాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని రైతులు కోరారు. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు పెద్దమందడి మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు జూరాల ప్రాజెక్టు వద్దకు తరలివెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకుని ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించకుండా ఆందోళనకు మద్దతుగా వెళ్తున్న వారిని అరెస్ట్‌ చేయడం సరికాదని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు జూరాల కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Latest Articles

ప్రజల గొంతుక డా. సతీష్‌ యాదవ్‌కు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్...

డ్రగ్స్ పై యువతకు అవగాహన కల్పించాలి

మదనపురం మండలంలో కేంద్రంలో పోలీస్ శాఖ పనితీరు మెరుగుపరచాలి బీసీ పొలిటికల్ జేఏసీ...

సీజనల్ వ్యాధులతో జాగ్రత్త13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణసెప్టెంబర్ 21:   పొలిటికల్...

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ప్రత్యేక పూజలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా పత్తి విష్ణువర్ధన్ రెడ్డి

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గర్వకారణం – న్యాయరంగంలో మరో అరుదైన ఘనతసాధారణ...

తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా పత్తి విష్ణువర్ధన్ రెడ్డి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

డ్రగ్స్ పై యువతకు అవగాహన కల్పించాలి

మదనపురం మండలంలో కేంద్రంలో పోలీస్ శాఖ పనితీరు మెరుగుపరచాలి బీసీ పొలిటికల్ జేఏసీ వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేందర్ నాయుడుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ప్రత్యేక పూజలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో సెప్టెంబర్ 21 2026: సికింద్రాబాద్ లాలాపేట్: శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని ఆరోపించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ .ED విచారణలో శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఎలాంటి జంతు కొవ్వు...
error: Content is protected !!