ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper

ఆకలితో ఎవ్వరూ బాధపడకూడదు.. అన్ని దానాలు కన్నా అన్నదానం మిన్న

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి మధిర, సెప్టెంబర్ 21: నిత్యం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆత్కూరు లో బతుకుదెరువు కోసం వచ్చిన వారికి భోజనం పంపిణీ చేయడం జరిగినది. నిరుపేదలకు ఆకలి తీర్చేందుకు హర్ష కేతన్ స్వచ్ఛంద సేవ ఫౌండేషన్ చేయూతనిచ్చిన బుచ్చిరెడ్డిపాలెం గ్రామం దోర్నాల దానియేలు సువార్త గార్ల జ్ఞాపకార్థంగా సందర్భంగా వారి మనవళ్ళు దోర్నాల ప్రమోద్ అభి వారి కుటుంబ సభ్యులు వారు పిల్లాపాపలతోని చిరు సంపదలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆకలితో అలమటించే నిరుపేదలకు అండగా నిలుస్తూ, ప్రతి ఒక్కరి కడుపు నిండేలా చేయాలనే సంకల్పంతో హర్ష కేతన్ స్వచ్ఛంద సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫౌండేషన్ ప్రజా సేవకుడు కూరపాటి సురేష్ చమార్ స్వయంగా భోజనం తయారు చేసి, మధిర పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ నిరుపేదలకు భోజనం అందించారు. ఇటీవల మధిర పట్టణంలో హర్ష కేతన్ సేవా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసిన కూరపాటి సురేష్ చమార్ .. సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో సోమవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న అనాథలు, నిరుపేదలు, సంచార జీవన విధానం సాగిస్తున్న వారు, ఆర్థికంగా వెనుకబడిన వారికి భోజనం అందించారు

తానే స్వయంగా వంట చేసి.. వీధుల్లోకి వెళ్లి.

సేవా కార్యక్రమం పేరుతో కేవలం మాటలకే పరిమితం కాకుండా సురేష్ కుమార్ స్వయంగా భోజనం తయారు చేసి, ప్యాకెట్లుగా సిద్ధం చేసి అవసరమైన వారి వద్దకు వెళ్లి అందించడం విశేషం. ఆకలితో ఉన్న వారికి ఒక పూట భోజనం అందించడం ద్వారా వారి ముఖాల్లో కనిపించే సంతృప్తే తనకు నిజమైన ఆనందమని ఆయన పేర్కొన్నారు.

ఆకలి తీర్చడమే అసలైన సేవ

‘ఆకలితో ఎవ్వరూ బాధపడకూడదు. అన్ని దానాల్లో అన్నదానం మిన్న’’ అనే భావనతో నిత్యం అన్నదానం కొనసాగిస్తున్నట్లు సురేష్ తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన అనేక కుటుంబాలు, అనాథలు, నిరాశ్రయులు కనీస అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారని, వారికి చేతనైనంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మరింత మందికి ఆకలి తీర్చేలా అన్నదాన కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకు దాతలు, సేవాభిమానులు తమకు తోచిన సహాయ సహకారాలు అందించాలని కోరారు.

మానవత్వమే నిజమైన సంపద

ఆకలి అన్నది కులం, మతం, ప్రాంతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేని బాధ. అలాంటి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చే ప్రతి చేయి సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మధిరలో హర్ష కేతన్ స్వచ్ఛంద సేవ ఫౌండేషన్ చేపడుతున్న ఈ సేవా కార్యక్రమం మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. ప్రజా సేవకుడు కూరపాటి సురేష్ చమర్ సంప్రదించండి 9493766918, 9059133918

Latest Articles

దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75 మంది గర్భిణులకు సామూహిక సీమంతం

ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్‌ఎస్‌  నాయకులు సోయం వీరభద్రం పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 21:...

” సమ్మక్క-సారక్క అంతర్జాతీయ విమానాశ్రయం”గా నామకరణం చేయాలి

తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక వైభవానికి, చారిత్రక వారసత్వానికి, వీరత్వానికి ప్రతీక. కాకతీయుల...

అగ్ని ప్రమాద బాధితులకు అండగా శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

14000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్టీ హాస్టల్ వార్డెన్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

14000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్టీ హాస్టల్ వార్డెన్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్  తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా   సామాజిక రాజకీయ విశ్లేషకులు కుర్రే రాజేందర్ రెడ్డి * *ఏసీబీ డి ఎస్పీ వై....

ఒక్క పుట్టినరోజు కోసం ఒక జీవితాన్నే కోల్పోవాలా..?

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*🚨 ఒక్క బర్త్‌డే కోసం... ఒక జీవితాన్ని కోల్పోవాలా?💔...

*శ్రీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  మార్గదర్శకత్వంలో అర్హులకు అందిన ‘సిఎంఆర్ఎఫ్’ ఆసరా*!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*​ఖమ్మం జిల్లా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, పేదల ఆరోగ్య...
error: Content is protected !!