ePaper
Thursday, September 24, 2026
📄 ePaper

గుర్వాయిగూడెంలో  టర్నడో బీభత్సం.. పంట తోటలు నేలమట్టం!

📰 Generate e-Paper Clip

మామిడి, జీడి, పామాయిల్, పత్తి పంటలకు తీవ్ర నష్టం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం పంచాయతీ పరిధిలోని గుర్వాయిగూడెం గ్రామంలో టర్నడో బీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా వీచిన బలమైన గాలులు, టర్నడో ప్రభావంతో గ్రామ పరిసర ప్రాంతాల్లోని పంట తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మామిడి, జీడి, పామాయిల్ తోటలతో పాటు పత్తి పంటకు కూడా భారీగా నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు.

అకస్మాత్తుగా వీచిన బలమైన గాలులకు పలుచోట్ల భారీ చెట్లు నేలకొరిగాయి. మామిడి, జీడి తోటల్లో కొమ్మలు విరిగిపడటంతో పాటు పామాయిల్ చెట్లు కూడా దెబ్బతిన్నాయి. పత్తి పంట సైతం గాలుల ధాటికి దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు.ఏళ్ల తరబడి పంట తోటలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు ఒక్కసారిగా వచ్చిన ప్రకృతి వైపరీత్యం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పంట చేతికొచ్చే సమయంలో టర్నడో రూపంలో విరుచుకుపడటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

రాత్రి సమయంలో ఘటన చోటుచేసుకోవడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఇదే ఘటన పగటి సమయంలో జరిగి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమ పంటలకు జరిగిన నష్టాన్ని అధికారులు వెంటనే పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు గ్రామంలో పర్యటించి ప్రతి పంటకు జరిగిన నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రకృతి వైపరీత్యంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న రైతులకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. అధికారులు త్వరితగతిన నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Latest Articles

మృతుడి కుటుంబానికి గౌతమ్ బుద్ధ సేవా సమితి ఆర్థిక చేయూత

దహన సంస్కారాల కోసం రూ.5 వేల ఆర్థిక సాయం అందజేత పొలిటికల్ పవర్, దమ్మపేట,...

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్

దహన సంస్కారాల కోసం ఆర్థిక సహాయం అందజేతపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

మద్దిగట్ల గ్రామంలో ఆపదలో ఉన్న కుటుంబానికి ‘మేఘన్న అభయహస్తం’

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

Related Articles

ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుపై నమ్మకం. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా గృహ నిర్మాణానికి పెద్దపీట వేసి, పేద‌ల‌...

ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ మృతి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*ట్యాంక్ బండ్ క్రేన్ 2 వద్ద గణేష్ నిమజ్జనం...

అక్రమ టేకు కలపపై టాస్క్‌ఫోర్స్ కొరడా..అంకంపాలెం బీట్‌లో రూ.7.05 లక్షల విలువైన కలప స్వాధీనం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 23:అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికివేయడం, చట్టబద్ధమైన పత్రాలు లేకుండా కలపను నిల్వ చేయడం, కొనుగోలు చేయడం, రవాణా చేయడంపై అటవీ శాఖ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఆధునిక...
error: Content is protected !!