ePaper
Sunday, September 27, 2026
📄 ePaper

ఘనపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఘనపురం ఖిల్లా ట్రెకింగ్ లో పాల్గొన్న శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 27 2026: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లాలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు వాటి ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఖిల్లాఘణపురం మండలంలోని ఘనపురం ఖిల్లా వద్ద ట్రెకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ట్రెక్కింగ్ కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, ఇతర ప్రతినిధులతో కలిసి వారు కోటను సందర్శించి చారిత్రక విశేషాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ… ఘనపురం ఖిల్లాకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, ఈ ప్రాంతంలోని చారిత్రక కట్టడాలు పూర్వీకుల మేధస్సుకు, నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువుల నిర్మాణం ద్వారా నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే విధానాన్ని అమలు చేశారని పేర్కొన్నారు. అప్పటి పాలకుల దూరదృష్టి, నిర్మాణ ప్రతిభను ఈ కట్టడాలు తెలియజేస్తున్నాయని తెలిపారు. వనపర్తి జిల్లాలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసి వాటికి మరింత గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సుమారు 80 ఏళ్ల క్రితమే సరళాసాగర్‌లో సైఫన్‌ విధానాన్ని ఏర్పాటు చేయడం అప్పటి ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమని వివరించారు. అలాగే చారిత్రక ప్రాధాన్యత కలిగిన రాజ మహల్‌కు (ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాల ఉన్న) భవనాన్ని కూడా పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఘనపురం ఖిల్లా అభివృద్ధికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో చర్చించి రెండు కోట్ల నిధులతో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) విడుదల కావాల్సి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైన అనుమతులు, ఉత్తర్వులు వచ్చిన అనంతరం కోట అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఘనపురం ఖిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన కేంద్రంగా మార్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. చాలా కాలం తర్వాత తిరిగి ఈ చారిత్రక ప్రాంతాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో స్థానిక ప్రాంతాలకు గుర్తింపు రావడంతో పాటు ప్రజలకు, ముఖ్యంగా యువతకు చరిత్రపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి. విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాస్మెటిక్ సామగ్రి, భోజన ఖర్చుల కేటాయింపులను పెంచినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సామగ్రితో కూడిన కిట్‌లను అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలని సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి జిల్లాలో అనేక చారిత్రక, ప్రకృతి అందాలతో కూడిన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటిని ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ట్రెకింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల విశిష్టత, చారిత్రక నేపథ్యం, ప్రకృతి సౌందర్యాన్ని ప్రజలకు తెలియజేయడం ద్వారా వాటిపై అవగాహన పెంపొందించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. మనం ముందుగా ఆయా ప్రాంతాల గురించి తెలుసుకోవడంతో పాటు, వాటి విశేషాలను ఇతరులకు కూడా తెలియజేయాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, యువతకు చరిత్రపై ఆసక్తి పెరుగుతుందని, జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం లభిస్తుందని తెలిపారు.

వ్యాసరచన, క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు 

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలల స్థాయిలో ఇటీవల నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి చేతుల మీదుగా ట్రెకింగ్ అనంతరం బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు జిల్లాలోని చారిత్రక ప్రదేశాలు, సంస్కృతి, వారసత్వ సంపద గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్, జిల్లా యువజన క్రీడల, పర్యాటకశాఖ అధికారి (డీవైఎస్‌ఓ) సుధీర్ రెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీఓ) హరికృష్ణ, నాయకులు సాయి చరణ్ రెడ్డి, ఆగారం ప్రకాష్, ఇతర ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

కలసపాడు మండల ఎస్సై హనుమంతుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా యువ నాయకుడు. నరసింహ…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్పిన్ 9టివి సమగ్ర జాతీయ తెలుగు...

ఆదివాసీ హక్కుల కోసం అక్టోబర్ 5న కలెక్టరేట్ ముట్టడి

కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.. జేఏసీ నాయకుల పిలుపు పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 27:...

కాశినాయన మండలంలో నాడు ‘రెవెన్యూ త్రయం’ ఇష్టారాజ్యం.. నేడు వెలుగులోకి కోట్ల రూపాయల భూ అక్రమాలు ..

................ అప్పటి ఎమ్మార్వో సుదీర్,...ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై...

పామిరెడ్డిపల్లి వైరాగ్యగిరికి మహర్దశ

  అక్టోబర్ 12 నుంచి గిరిప్రదక్షిణకు శ్రీకారం వైరాగ్యగిరి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా...

గుర్రం జాషువా గారి 131వ జయంతోత్సవ పత్రిక విడుదల.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు...

*డీఎస్పీ భీమ్ రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు..*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్...

Related Articles

గుర్రం జాషువా గారి 131వ జయంతోత్సవ పత్రిక విడుదల.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 27 2026: నవయుగ కవి చక్రవర్తి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత...

వినూత్నంగా మంగయ్య గుడి గణపతి నిమజ్జన శోభాయాత్ర

– రూ.1,75,516.లకు లడ్డూ వేలం పాటలో గ్యాస్ జడలయ్య  దక్కించుకున్నారు. పొలిటికల్.పవర్.సమగ్రజాతీయతెలుగుదినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.  ఈశ్వర్. సెప్టెంబర్. 28. 2026.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని గణపతి నవరాత్రులలోభాగంగామంగయ్యగుడిదేవాలయంలో...

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు...
error: Content is protected !!