ePaper
Sunday, November 1, 2026
📄 ePaper

రౌడీషీట్ల రాజకీయం.. అధికారం మారితే టీడీపీ భవిష్యత్తు ఏంటీ? టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్న చంద్ర‌బాబు, లోకేష్‌ వైసీపీ అధికారంలోకి వస్తే.. చ‌ర్య‌కు ప్ర‌తిచ‌ర్య ఉండ‌దా..? అనాలోచిన నిర్ణ‌యాలు, రాజ‌కీయ క‌క్ష‌సాధింపుల‌తో కార్య‌క‌ర్త‌ల‌ను ఇర‌కాటంలో పెడుతున్న లోకేష్

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*‌

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రత్యర్థులపై కేసులు, రౌడీషీట్ల వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. విజయవాడలో గతంలో నమోదైన కేసులు, నిరసనలకు సంబంధించి 51 మంది వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై రౌడీషీట్లు తెరవాలని విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ అసాదార‌ణ ఆదేశాలిచ్చారు. ఐదేళ్ల క్రితం నాటి కేసులో ఇప్పుడు రౌడీ షీట్లు ఓపెన్ చేయాల‌ని ఆదేశాలివ్వ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

ఆంధ్ర‌ప‌దేశ్ రాష్ట్రంలో అంబేద్క‌ర్ ర‌చించిన రాజ్యాంగానికి చోటుందా..? ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌తో పాల‌న సాగుతుందా..? నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాజ‌కీయ క‌క్ష‌సాధింపుల‌కు కొంద‌రు పోలీసుల‌ను పావులుగా ఉప‌యోగించుకుంటున్న తీరుపై రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

51 మందిపై రౌడీషీట్ల ఆదేశాలు
ఐదేళ్ల క్రితం నాటి ఘటనలు, వివిధ నిరసనలకు సంబంధించి విజయవాడ పరిధిలోని 9 పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలకు 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని విజ‌య‌వాడ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో వైఎస్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, దేవినేని అవినాష్ పేర్లు కూడా ఉన్నాయి.

నిరసనలపైనా కఠిన చర్యలు
డీఎస్సీ అంశంపై ఎస్‌ఏఏపీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వారిపై కూడా రౌడీషీట్ల చర్యలు చేపట్టడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలపై కేసులు, రౌడీషీట్ల ప్రభావం ఎన్నికల రాజకీయాలపై పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

చర్యకు ప్రతిచర్య ఉండ‌దా..
చంద్ర‌బాబు, లోకేష్ త‌మ అధికారాల‌ను రాజ‌కీయ క‌క్ష‌సాధింపుల‌కు ఉప‌యోగిస్తున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం.
అధికారంలో ఉన్న సమయంలో చేయని తప్పులకు ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను బలవంతంగా ఇరికించి, వారిపై అకారణంగా కఠిన చర్యలు తీసుకుంటే, భవిష్యత్‌లో అధికార మార్పిడి జరిగినప్పుడు అదే తరహాలో ప్ర‌తిచర్యలు ఉంటాయ‌నే స్పృహ వారిలో ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కోరి మ‌రీ తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల భ‌విష్య‌త్తును నారా లోకేష్ చిక్కుల్లో ప‌డేస్తున్నార‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Latest Articles

కదిరిలో బి.ఎస్. మక్బూల్ మార్క్… 14వ వార్డులో ఓటు హక్కు వినియోగం!

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

హరీష్ రావు సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

హైదరాబాద్ బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్...

రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9...

గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి

నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో...

ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

Related Articles

🚨 రాప్తాడు రణక్షేత్రం: స్కూలే లక్ష్యంగా ఉన్మాది పైశాచికత్వం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం!

 అనంతపురం, అక్టోబర్ 31: పొలిటికల్ పవర్  ప్రతినిధి నాగరాజు రెడ్డిచదువుకోవాల్సిన బడి ప్రశాంత వాతావరణం నుండి ఒక్కసారిగా రక్తసిక్తమైంది. అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన దారుణ ఘటన రాష్ట్ర...

భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!* డిజిటల్ విప్లవంతో సరికొత్త రూపు.. కొన్ని రాష్ట్రాలకు మినహాయింపులు ఎందుకు? పూర్తి వివరాలు తెలుసుకుందాం!

*🇮🇳 భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి...

error: Content is protected !!