ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

ప్రొద్దుటూరులో వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ హాజరైన పార్టీ నాయకులు పాతకోట బంగారు రెడ్డి, పాతకోట వంశీధర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

ప్రొద్దుటూరు (రాజకీయ విభాగం):

ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని 27 మరియు 28వ వార్డులకు సంబంధించి స్థానిక రామేశ్వరంలోని మునిస్వామి దేవాలయం ప్రాంగణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల (ID Cards) పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నాయకులు పాతకోట బంగారు రెడ్డి  మరియు పాతకోట వంశీధర్ రెడ్డి  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఐడీ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పాతకోట బంగారు రెడ్డి  మాట్లాడుతూ… పార్టీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలే వైయస్ఆర్సీపీకి అసలైన బలమని కొనియాడారు. కార్యకర్తలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగానే ఈ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

పాతకోట వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ… వార్డు స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో 27, 28వ వార్డుల వైయస్ఆర్సీపీ నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు, మహిళలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Latest Articles

తెలంగాణను పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్‌ నేతలకు ఇప్పుడు కరువు గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?

– కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, నేడు...

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

Related Articles

YS Jagan calls for unity in Kadapa Polls

 Yerra Nagaraju Reddy Telangana and Andhra Pradesh States Bureau In-charge for "Political Power Comprehensive National Telugu Daily Newspaper" & "Political News9 TV...

అవినీతిపరుల నుంచి అనంతపురాన్ని కాపాడుకుందాం…

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*వైయస్ఆర్ సీపీని గెలిపిస్తే...

కలసపాడు మండల పరిషత్ అధ్యక్షుడిగా ముట్టే చెన్నయ్య ఏకగ్రీవ ఎన్నిక

 కలసపాడు అక్టోబర్ 27 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. వైఎస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో రామాపురం...
error: Content is protected !!