ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

వైసీపీలోకి జనసేన సాయికృష్ణ యాదవ్‌* – కూటమిపాలనలో కుంటుపడిన నగరాభివృద్ధి : జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి  – ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లిన ఘనత వైసీపీదే : మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌  – పవన్‌కళ్యాణ్‌ను నమ్మి మోసపోయిన యువత : యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌ 

📰 Generate e-Paper Clip

 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

అనంతపురం, అక్టోబర్‌ 24 :

అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న వేళ అనంతపురం నగరంలోని ఒకటో డివిజన్‌కు చెందిన జనసేన సాయికృష్ణ యాదవ్‌ తన మిత్రబృందంతో కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేత అనంత చంద్రారెడ్డి, నగర అధ్యక్షులు చింతా సోమశేఖరరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు సాకే చంద్ర, నాయకులు అమర్‌నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ 1వ డివిజన్‌కు చెందిన జనసేన నాయకులు సాయికృష్ణ ఆ పార్టీ కోసం క్రియాశీలకంగా పని చేశారని, అలాంటి వ్యక్తి వైసీపీలోకి రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజలందరూ గుర్తించుకోవాలన్నారు. నామినేషన్‌ దాఖలు చేసిన వైసీపీ శ్రేణులపై కూటమి నేతలు దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ నగరంలో జరుగుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అనుసరిస్తున్న ధోరణి, వారి అరాచకాలు, పేదల ఆస్తులను ఎలా కాజేయాలని కుట్రపన్నుతున్నారన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేది వైఎస్సార్‌సీపీనే అన్నారు. గత వైసీపీ హయాంలో జరిగిన అనంత అభివృద్ధిని.. ప్రస్తుతం రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వంలో నగరాన్ని కుంటుపరిచారన్నారు. ఈ నగరంలో శాంతిభద్రతలు లోపించాయని, అభివృద్ధి జరగాలన్నా.. ప్రశాంతత వాతావరణం ఉండాలన్నా వైసీపీతోనే సాధ్యమన్నారు. జనసేన నుంచి వచ్చిన సాయికష్ణతోపాటు ఆయన మిత్రబృందం వైసీపీ కుటుంబంలో చేరడం సంతోషించదగ్గ విషయమన్నారు.

మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని రమేష్‌ గౌడ్‌ ఆరోపించారు. కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని, పేదల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, రోడ్లు, పారిశుద్ధ్య పనులు సక్రమంగా సాగడం లేదని రమేష్‌ గౌడ్‌ విమర్శించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో నగరాభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదన్నారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గతంలో అనంత వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నగరం ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. కరోనా సమయంలో, వరదలు సంభవించినప్పుడు ప్రజలకు అండగా నిలిచి సేవలందించిన నాయకత్వం వైసీపీదేనన్నారు. కులమతాలకతీతంగా ఐక్యమత్యంతో ఉండే ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని రమేష్‌ గౌడ్‌ సూచించారు. నగర ప్రజల ఆస్తులకు రక్షణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని కోరారు. అనంతపురం నగర ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే నగరపాలక సంస్థలోని 62 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో కూటమి అభ్యర్థులకు తగిన సమాధానం చెప్పాలని ప్రజలను కోరారు.

వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. సాయికృష్ణ యాదవ్‌ మిత్ర బృందం జనసేన నుంచి వైసీపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. పవన్‌కళ్యాణ్‌ను నమ్మి యువత పెద్ద ఎత్తున మోసపోయారని తెలిపారు. వైసీపీ హయాంలో సచివాలయ ఉద్యోగాలు కల్పించి వాలంటీర్లను నియమించి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. గత ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ప్రతి నెలా రూ.10 వేలు ఇస్తామని చెప్పి చివరకు ఆ వ్యవస్థే లేకుండా చేశారన్నారు. అనంతపురం నగరంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎలా ఉంది? ఈ రెండున్నరేళ్ల కూటమి పాలనలో ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనంతపురంలో కబ్జాలు పెరిగిపోయాయని, ప్రజల ఆస్తులకు భరోసా లేకుండాపోయిందన్నారు. అధికార పార్టీ నేతలే రేషన్‌ దందా చేస్తున్నారని అన్నారు. వైసీపీ మేయర్‌ అభ్యర్థి రమేష్‌గౌడ్‌తో పాటు 1వ డివిజన్‌ అభ్యర్థి షెక్షా, 4వ డివిజన్‌ అభ్యర్థి ప్రణతిలను గెలిపించాలని కోరారు.

వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం : సాయికృష్ణ యాదవ్‌

జనసేన నుంచి వైసీపీలోకి చేరిన సాయికృష్ణ యాదవ్‌ మాట్లాడుతూ.. 1, 4వ డివిజన్‌ల వైసీపీ అభ్యర్థులు షెక్షావలి, ప్రణతితోపాటు మేయర్‌ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌ గెలుపే లక్ష్యంగా తనవంతు కృషి చేస్తానన్నారు. వైసీపీ సిద్ధాంతాలు నచ్చి జనసేన వీడినట్లు చెప్పారు. వైసీపీ బలోపేతం కోసం శాయశక్తులా పని చేస్తానని తెలిపారు.

Latest Articles

తెలంగాణను పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్‌ నేతలకు ఇప్పుడు కరువు గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?

– కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, నేడు...

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

Related Articles

YS Jagan calls for unity in Kadapa Polls

 Yerra Nagaraju Reddy Telangana and Andhra Pradesh States Bureau In-charge for "Political Power Comprehensive National Telugu Daily Newspaper" & "Political News9 TV...

అవినీతిపరుల నుంచి అనంతపురాన్ని కాపాడుకుందాం…

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*వైయస్ఆర్ సీపీని గెలిపిస్తే...

కలసపాడు మండల పరిషత్ అధ్యక్షుడిగా ముట్టే చెన్నయ్య ఏకగ్రీవ ఎన్నిక

 కలసపాడు అక్టోబర్ 27 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. వైఎస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో రామాపురం...
error: Content is protected !!