ePaper
Friday, October 30, 2026
📄 ePaper

అకాల వర్షంతో పత్తి రైతులకు అపార నష్టం..పత్తి తీయకముందే వర్షం

📰 Generate e-Paper Clip

పంట చేతికొచ్చే సమయంలో ఆర్నబ్ తుఫాన్ రైతులకు తీరని నష్టం..

జూలూరుపాడు అక్టోబర్28: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిన్9 తెలుగు న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో అకాల వర్షాలు పత్తి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మండల పరిధిలోని అధిక శాతం మంది రైతులు పత్తి, వరి, మిర్చి పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున పత్తి, మిర్చి పంటలను సాగు చేసిన రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.

పత్తి చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడంతో పత్తి తీయకముందే తడిసి నల్లబడుతోంది. దీంతో పత్తి నాణ్యత దెబ్బతినడంతో పాటు ఆశించిన ధర లభించకపోవచ్చని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులు, అకాల వర్షాల కారణంగా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని వాపోతున్నారు.

ప్రభుత్వం స్పందించాలి.. రైతులను ఆదుకోవాలి

అకాల వర్షాలతో నష్టపోతున్న పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రభావిత ప్రాంతాల జాబితాలో పరిగణనలోకి తీసుకోకపోవడంపై పలువురు రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Latest Articles

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్...

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ...

జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై మండల సిపిఐ సమితి ఆగ్రహం 

 జూలూరుపాడు అక్టోబర్ 29: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మార్కెట్ కమిటీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి:సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్

కొత్తగూడెం, అక్టోబర్ 29 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

భద్రతా చర్యలు పాటించకుండా నివాస ప్రాంతంలో భారీ మొత్తంలో టపాసుల అక్రమ నిల్వ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

మేడిపల్లి: 29 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ,మేడిపల్లి పోలీస్...

Related Articles

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి, అక్టోబర్- 29:వెలుగుమట్ల కాలనీలో నిర్మిస్తున్న...

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల మంజూరులో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి భూగర్భ మురుగునీటి పారుదల పనులు ఫిబ్రవరి 2027 నాటికి వంద శాతం...
error: Content is protected !!