ePaper
Friday, October 30, 2026
📄 ePaper

ఉపాధి హామీ పనులపై మేట్లకు శిక్షణ

📰 Generate e-Paper Clip

నారాయణపురం రైతు వేదికలో VB-G RAM G పథకంపై అవగాహన కార్యక్రమం

పొలిటికల్ పవర్, నారాయణపురం, అక్టోబర్ 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలోని రైతు వేదికలో VB-G RAM G (వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్–గ్రామీణ) పథకంపై మేట్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 40 మంది మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ సిబ్బంది ఈ శిక్షణలో పాల్గొన్నారు.

ఎంపీడీవో కిషోర్, మండల ఏపీవో కె. రామచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు కె. బాలకృష్ణ, వి. కామేశ్వరి, అస్మా, బి. మహేష్ శిక్షణ ఇచ్చారు. పథకం కింద చేపట్టే పనుల విధానం, పనులకు కొలతలు నిర్ణయించడం, ప్రస్తుతం చేపడుతున్న పనుల వివరాలు, కొలతల నమోదు తదితర అంశాలను వివరించారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రైతు వేదికలో సైద్ధాంతిక శిక్షణ నిర్వహించగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అల్లం మహాలక్ష్మి ఫామ్‌పాండ్ వద్ద క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పనుల గుర్తింపు, మార్కింగ్, కొలతలు నమోదు చేసే విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో నారాయణపురం సర్పంచ్ మడకం కుమారి ఆంధ్రయ్య, పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్, నరంవారిగూడెం కార్యదర్శి జగదీష్, వ్యవసాయ శాఖ ఏఈఓ రవీంద్ర, సొసైటీ సీఈఓ అరుణ, సండిపోగు రవి తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే.. అశ్వారావుపేట పోలీసుల హెచ్చరిక!

డ్రంకెన్ డ్రైవ్‌లో నలుగురు పట్టివేత.. ఇద్దరికి జైలు శిక్ష,మరో ఇద్దరికి జరిమానాఅశ్వారావుపేట,పొలిటికల్...

ఎల్‌నినో ప్రభావం – వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

– కొత్తకోట మున్సిపాలిటీ చైర్‌పర్సన్  అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

30,000/- విలువైన వంట సామగ్రి విరాళం అందించిన JSPW వైస్ ప్రెసిడెంట్ వేముల సీతారామారావు గారు

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులుగా గద్దల అప్పారావు నియామకం

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, అర్ సి ఇంచార్జ్.(మేడపురెడ్డి నాగార్జున):కాంగ్రెస్ పార్టీ ఎస్సీ...

మళ్లీ రంగంలోకి బాస్.. అభివృద్ధికి జూపల్లి జోరు! విదేశీ పర్యటన ముగిసింది.. ప్రజాక్షేత్రంలోకి...

Related Articles

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే.. అశ్వారావుపేట పోలీసుల హెచ్చరిక!

డ్రంకెన్ డ్రైవ్‌లో నలుగురు పట్టివేత.. ఇద్దరికి జైలు శిక్ష,మరో ఇద్దరికి జరిమానాఅశ్వారావుపేట,పొలిటికల్ పవర్, అర్ సి ఇంచార్జ్, (మేడపురెడ్డి నాగార్జున) అక్టోబర్ 30: మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాలతో చెలగాటమాడితే జైలుకు వెళ్లక...

30,000/- విలువైన వంట సామగ్రి విరాళం అందించిన JSPW వైస్ ప్రెసిడెంట్ వేముల సీతారామారావు గారు

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే 'జస్టిస్ ఫర్...

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులుగా గద్దల అప్పారావు నియామకం

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, అర్ సి ఇంచార్జ్.(మేడపురెడ్డి నాగార్జున):కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా గద్దల అప్పారావు నియమితులయ్యారు. స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్...
error: Content is protected !!