ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం

📰 Generate e-Paper Clip

కార్మిక చట్టాల పరిరక్షణకు కదలాలి:ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమాలే శరణ్యం

కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి:సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్: భారత కార్మిక వర్గ పోరాటాలకు అసలైన దిక్సూచి ఏఐటీయూసీ మాత్రమేనని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా స్పష్టం చేశారు. స్థానిక పెద్దబజార్లోని హమాలీ అడ్డాలో శుక్రవారం జరిగిన హమాలీ కార్మికుల సమావేశంలో అయన మాట్లాడారు. ఈ 106 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఘనత ఏఐటీయూసీకి మాత్రమే దక్కుతుందన్నారు. దేశంలో కార్మికులు రక్తం ధారపోసి సాధించుకున్న హక్కులను కేంద్ర పాలకులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల అసంఘటిత, సంఘటిత రంగ కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం దుర్మార్గమన్నారు. అక్టోబర్ 31న జరుపుకుంటున్న ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా ఈ వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవాలని, ఆవిర్భావ దినోత్సవ స్పూర్తితో కార్మిక హక్కుల సాధనే లక్ష్యంగా కదలాలన్నారు.. పాలకుల అణచివేత చర్యలను తిప్పికొట్టడానికి కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాటాలు నిర్మిస్తామని ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్మిక ఐక్యతే ఆయుధంగా ముందుకు సాగి చట్టాలను కాపాడుకోవాలన్నారు. హమాలీల సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పాలకుల విధానాలపై రాబోయే రోజుల్లో సమరశీల పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తరాల రాజు, నీలం మొగిలి, వెలిశాల మోహన్ రావు, కత్తెర శ్రీనివాస్, అశోక్, సర్పంచ్ రామనాథం తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి బెదిరింపులపై విచారణ జరపాలి

మహిళకు న్యాయం జరిగేవరకు పోరాటం మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా...

అంకాళమ్మ వారికి విశేష పూజలు

నంద్యాల జిల్లా శ్రీశైలం అక్టోబర్ 30( పొలిటికల్ పవర్ న్యూస్ ) లోకకల్యాణం...

‘బియ్యం’ మాఫియా గుప్పిట్లో మార్కెట్‌!

‘ఎల్‌ నినో’ సాకుతో వ్యాపారుల సిండికేట్‌.. కృత్రిమ కొరత సృష్టించి కిలో రూ.82...

Related Articles

గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన నిలుపుదల చేయాలని, మౌలిక సమస్యలను పరిష్కరింపజేయాలని, ఎస్ సి ఆర్ రైల్వే అధికారికి వినతి పత్రం.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం : మహాబాబూబాద్ జిల్లా గార్ల మండల ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన ఎక్స్ప్రెస్...

రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి బెదిరింపులపై విచారణ జరపాలి

మహిళకు న్యాయం జరిగేవరకు పోరాటం మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్...
error: Content is protected !!