ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి

📰 Generate e-Paper Clip

🔸 గాయపడిన ప్రవళికను పరామర్శించిన నేత
🔸 బాధితురాలు త్వరగా కోలుకోవాలని
🔹 కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

పొలిటికల్ పవర్ సమగల జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్,కొత్తగూడెం : విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై జరిగిన దాడి అత్యంత దురదృష్టకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మణుగూరు డిపోకు చెందిన కండక్టర్ గుండ్ల ప్రవళికపై ఇటీవల ప్రయాణికులు దాడి చేసి బస్సు కిందకు తోసేయడంతో ఆమె రెండు కాళ్లతో పాటు శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సాయి సంజీవిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని శుక్రవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్వయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రవళిక ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య చికిత్స వివరాలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘోర ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధితురాలికి ఎలాంటి లోటు లేకుండా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం ప్రాంతానికి చెందిన ప్రవళిక, తండ్రి మరణానంతరం వచ్చిన వారసత్వ ఉద్యోగంతో కుటుంబాన్ని పోషిస్తోందని గుర్తుచేశారు. కష్టపడి పనిచేసే ఇలాంటి ఉద్యోగులపై దాడులు జరగడం విచారకరమన్నారు. ఈ కష్ట సమయంలో ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పి, బాధితురాలు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. .

Latest Articles

రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి బెదిరింపులపై విచారణ జరపాలి

మహిళకు న్యాయం జరిగేవరకు పోరాటం మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా...

అంకాళమ్మ వారికి విశేష పూజలు

నంద్యాల జిల్లా శ్రీశైలం అక్టోబర్ 30( పొలిటికల్ పవర్ న్యూస్ ) లోకకల్యాణం...

‘బియ్యం’ మాఫియా గుప్పిట్లో మార్కెట్‌!

‘ఎల్‌ నినో’ సాకుతో వ్యాపారుల సిండికేట్‌.. కృత్రిమ కొరత సృష్టించి కిలో రూ.82...

Related Articles

గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన నిలుపుదల చేయాలని, మౌలిక సమస్యలను పరిష్కరింపజేయాలని, ఎస్ సి ఆర్ రైల్వే అధికారికి వినతి పత్రం.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం : మహాబాబూబాద్ జిల్లా గార్ల మండల ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన ఎక్స్ప్రెస్...

రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి బెదిరింపులపై విచారణ జరపాలి

మహిళకు న్యాయం జరిగేవరకు పోరాటం మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్...
error: Content is protected !!