ePaper
Monday, November 2, 2026
📄 ePaper

జగన్‌మోహన్ రెడ్డి అంత అమాయకుడు ఏమీ కాదు క్రింద కూర్చొని నిరసన తెలియజేయటానికి చంద్రబాబూ… ఆయన రాజకీయ ఎత్తుగడలు అర్థం చేసుకోవటం నీ కొడుకు లోకేష్ కి, పవణ్ కళ్యాణ్ కి అర్ధం కాకపోవచ్చు.. కానీ, నీకు అర్ధం అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను..

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

పులివెందుల ఆర్.ఓ. కార్యాలయం దగ్గర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కింద కూర్చున్నాడని కొందరు గొర్రెల మందలా సంకలు గుద్దుకుంటూ విమర్శలు చేస్తున్నారు.

అసలు జగన్ ఎందుకు కూర్చున్నాడు? ఎందుకు ఆ పంథాను ఎంచుకున్నాడు? దాని వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏమిటి? అన్నది ఆలోచించే తెలివి ఉండాలి.. అది చంద్రబాబు కి ఖచ్చితం గా ఉంది..

ఒక మాజీ ముఖ్యమంత్రి కింద కూర్చున్న దృశ్యం పులివెందులకే పరిమితం కాలేదు. స్థానిక మీడియా నుంచి జాతీయ మీడియా వరకు ఈ ఘటనను కవర్ చేశాయి. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తీరు, పులివెందుల పరిణామాలు, జగన్‌మోహన్ రెడ్డి నిరసన చర్చనీయాంశంగా మారాయి.

ఒక్కసారి ఆలోచించండి.. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆర్.ఓ. కార్యాలయం ముందు కూర్చుంటే దేశవ్యాప్తంగా వార్త అవుతోంది. జాతీయ మీడియా చర్చల్లోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై దేశం దృష్టి పడుతోంది. అనే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు..

మరోవైపు ఈ పరిణామాలతో కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ప్రతిష్టపై ప్రశ్నలు తలెత్తేలా ఈ ఘటన మారింది. కూటమి ప్రభుత్వం పరువు పోయింది.

ఇదంతా చూసిన తర్వాత కూడా జగన్ ఏదో తెలియక కింద కూర్చున్నాడని మాట్లాడేవాళ్ల అమాయకత్వానికి ఏం పేరు పెట్టాలి?

రాజకీయాల్లో ఎప్పుడు నిలబడాలి, ఎప్పుడు పోరాడాలి, ఎప్పుడు కింద కూర్చోవాలి అన్నది తెలిసినవాడే రాజకీయ నాయకుడు.. పులివెందుల యాక్షన్ కి రియాక్షన్ కూడా ఎప్పుడు ఉండాలి అనేది కూడా జగన్ ఈ పాటికే నిర్ణయించి ఉంటాడు..

జగన్ చర్య వెనుక ఉన్న ఉద్దేశం, వ్యూహం గురించి చర్చించండి. ఆయన చేసిన పనిని అర్థం చేసుకోకుండా ఎగతాళి చేయడం మీ రాజకీయ అవగాహనారాహిత్యానికి అద్దం పడుతుంది.

జగన్‌ను విమర్శించే ముందు ఆయన ఆ చర్యతో ఏం సాధించాలనుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి.

కావాలంటే న్యూస్ ఛానల్స్ చెక్ చేసుకోండి..ఆదివారం  దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

 

Latest Articles

✍️త్యాగాల పునాదులపై నిర్మితమైనది ఏఐటీయూసీ.శ్రామిక లోకానికి ఏఐటీయూసీ కొండంత అండ.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ...

ఆదివాసీల హక్కుల సాధనకు సమరశీల పోరాటమే శరణ్యం!

దమ్మపేట ఆదివాసి సేన నూతన మండల కమిటీ ఎన్నిక ఆదివాసీల సమస్యలపై నిరంతర...

“శుభకార్యంలో ఆశీర్వాదం.. విషాదంలో పరామర్శ.. ప్రజలకు అందుబాటులో సోయం వీరభద్రం”

పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, నవంబర్ 1:అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం నిర్వహించిన...

రోడ్లపై క్షుద్ర పూజల కలకలం!

 రాజాపురం ఎస్సీ కాలనీలో భయాందోళనలు.. మూఢనమ్మకాలపై చర్యలేవీ? ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్న దుండగులను...

Related Articles

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుతో కదనరంగంలోకి యంగ్ బ్రిగేడ్: ఖమ్మం 28వ డివిజన్‌లో ఘనంగా ‘యం.ఎస్.ఎఫ్’ కమిటీ ఏర్పాటు! విద్యార్థుల హక్కుల పరిరక్షణే ధ్యేయం – సమస్యలపై సమరశంఖం పూరిస్తాం: బాకీ...

ఖమ్మం (పట్టణం):ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఎన్. శివకుమార్ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ పిలుపుతో విద్యార్థి లోకంలో సరికొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. భవిష్యత్తు పోరాటాలకు సన్నద్ధమవుతూ... మాదిగ స్టూడెంట్...

✍️త్యాగాల పునాదులపై నిర్మితమైనది ఏఐటీయూసీ.శ్రామిక లోకానికి ఏఐటీయూసీ కొండంత అండ.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్✍️లేబర్ కోడ్లతో కార్మిక చట్టాల రద్దు దుర్మార్గం.✍️ప్రభుత్వ రంగ...

దేశ సమగ్రతకు పటేల్ కృషి ఆదర్శం అఖండ భారత నిర్మాణంలో పటేల్ పాత్ర పటేల్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్కొత్తగూడెం : దేశ ఐక్యత, సమగ్రత కోసం నిరంతరం పరితపించిన...
error: Content is protected !!