
కలసపాడు పొలిటికల్ పవర్ నవంబర్ 2 పిన్ 9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాదరావు
. కలసపాడు వైఎస్సార్ కడప జిల్లా.
బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం బాలాయపల్లి, నాయనపల్లె, ఆకుల నారాయణపల్లె ఎస్సీ కాలనీ గ్రామాల్లో జడ్పీటీసీ అభ్యర్థి బి. నాగలక్ష్మి గారి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని స్థానిక సంస్థల ఎన్నికల రథసారథి, యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దేవసాని సత్యనారాయణ రెడ్డి , నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూలవర్షం కురిపిస్తూ, పూలమాలలు, శాలువాలతో ఆదిత్య రెడ్డి గారిని ఘనంగా సత్కరించి అపూర్వ స్వాగతం పలికారు.
ప్రజల ఆత్మీయ ఆదరణతో ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. అనంతరం ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ, ప్రజల అభిప్రాయాలను ఎవరూ అడ్డుకోలేరని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేస్తారని పేర్కొన్నారు. నేడు ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తూ తమ మద్దతును తెలియజేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి బి. నాగలక్ష్మి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

