ePaper
Friday, November 6, 2026
📄 ePaper

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆర్‌ అండ్‌ బీ అధికారులకు ఫారం–18 అందజేత

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 03 2026: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏఐపీసీ, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏఐపీసీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు జి. నాగార్జున, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకుడు ఎత్తం చరణ్‌రాజ్ ఆర్‌ అండ్‌ బీ ఇంజనీరింగ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరిమళతో పాటు కార్యాలయ సిబ్బందికి ఫారం–18లను అందజేశారు. అర్హులైన పట్టభద్రులందరూ ఫారం–18 ద్వారా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును పొందాలని వారు కోరారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డికి మద్దతుగా పట్టభద్రులు నిలిచి ఆయన విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు, పుట్ట బాలరాజు, కుమార్, రాజు, రవి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Latest Articles

ప్రత్యామ్నాయాలను పట్టించుకోని ప్రభుత్వం… ఏకపక్ష ధోరణితో ఏజెన్సీలో విధ్వంసం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

*దుగ్గిరాల ఎన్నికల్లో భారీ రిగ్గింగ్..*  *7 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలి వైఎస్ఆర్సీపీ డిమాండ్*..

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

వనపర్తిలో న్యాయవ్యవస్థకు సరికొత్త వసతులు..

తుది దశలో ఉన్న రూ.80 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్...

వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు..

ప్రజలకు మరింత చేరువగా బ్యాంకింగ్ సేవలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను...

పేద విద్యార్థుల విదేశీ విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ

మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధికి వనపర్తి నుంచి 8...

Related Articles

వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు..

ప్రజలకు మరింత చేరువగా బ్యాంకింగ్ సేవలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి...

పేద విద్యార్థుల విదేశీ విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ

మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధికి వనపర్తి నుంచి 8 మంది ఎంపిక.. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో...

మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి!

RSETI శిక్షణతో 36 మంది గ్రామీణ మహిళలకు ఉద్యోగాలు నెలకు రూ.20 వేల వేతనం.. ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు శిక్షణ నుంచి ఉద్యోగ నియామక పత్రాల వరకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ పొలిటికల్ పవర్...
error: Content is protected !!