ePaper
Friday, November 6, 2026
📄 ePaper

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రత. * జిల్లా వ్యాప్తంగా 2,155 మంది పోలీసులతో పటిష్ట భద్రత.  – ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా… అదనపు బలగాల మోహరింపు. – సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ. – ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: … కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ .

📰 Generate e-Paper Clip

 

 

పొలిటికల్ పవర్ ప్రతినిధి   కర్నూలు జిల్లా

దస్తగిరి పి

నవంబర్ 5 న కర్నూలు జిల్లా వ్యాప్తంగా జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ముందస్తు భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసిందని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు బుధవారం తెలిపారు.

ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీగారు పిలుపునిచ్చారు.

జిల్లాలోని కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు 4 సబ్ డివిజన్ల పరిధిలలో ఎన్నికలు జరగనున్నాయి.

94 అత్యంత సమస్యాత్మక, 162 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టామన్నారు.

భద్రతా బలగాల మోహరింపు – ప్రత్యేక నిఘా:

జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 7 మంది డీఎస్పీలు, 39 మంది సీఐలు, 61 మంది ఎస్సైలు, 87 మంది ఏఎస్సైలు, 236 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 693 మంది కానిస్టేబుళ్లు, 316 మంది హోంగార్డులతో పాటు 13 ఏపీఎస్పీ ప్లటూన్లు మరియు ఏ ఆర్ పోలీసులు, అటవీ, విజిలెన్స్, ఎక్సైజ్, రైల్వే శాఖల సిబ్బందితో కలిపి మొత్తం 2,155 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

– ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి:

గత చరిత్రను దృష్టిలో ఉంచుకుని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. .

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు.

– మొబైల్ నిఘా బృందాలు: 175 రూట్ మొబైల్ బృందాలు, 30 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 30 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 7 డీఎస్పీ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తాయి.

– చెక్ పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్: ఎన్నికల నియమావళి అమలును పర్యవేక్షించేందుకు 26 ఫ్లయింగ్ స్క్వాడ్స్ (ఎంసీసీ), 26 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (ఎస్ఎస్టీ) / చెక్ పోస్టులు, 11 శాంతిభద్రతల పికెట్లను ఏర్పాటు చేశారు.

– సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా: .

సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షణ చేపడతారు.

– ముందస్తు బైండోవర్లు: ఎన్నికల సమయంలో ఘర్షణలకు పాల్పడే అవకాశం ఉన్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, అల్లర్లకు కారణమయ్యే వ్యక్తులను గుర్తించి ముందస్తు బైండోవర్ చర్యలు చేపట్టామన్నారు.

రాజకీయ నాయకులు, అభ్యర్థులు, ప్రజలు పాటించాల్సిన నిబంధనలు:..

రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘం జారీ చేసిన పాసులు లేదా అనుమతి ఉన్న వాహనాల్లో మాత్రమే ప్రయాణించాలి.

అనుమతి లేని వాహనాల్లో తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామన్నారు.

– సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు:

ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి.

అనుమతి లేకుండా నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే ఓటర్లు తమ ఇళ్లకు వెళ్లిపోవాలి.

పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇంకు సీసాలు లేదా ఇతర నిషేధిత వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతి లేదు.

ఇప్పటికే విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ నగదు, మద్యం, ఇతర వస్తువుల రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

– సోషల్ మీడియాపై నిఘా.

వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, తప్పుడు ప్రచారం చేసినా, పుకార్లు వ్యాప్తి చేసినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు.

జిల్లా పోలీస్ కార్యాలయం – కర్నూలు.

Latest Articles

ప్రత్యామ్నాయాలను పట్టించుకోని ప్రభుత్వం… ఏకపక్ష ధోరణితో ఏజెన్సీలో విధ్వంసం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

*దుగ్గిరాల ఎన్నికల్లో భారీ రిగ్గింగ్..*  *7 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలి వైఎస్ఆర్సీపీ డిమాండ్*..

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

వనపర్తిలో న్యాయవ్యవస్థకు సరికొత్త వసతులు..

తుది దశలో ఉన్న రూ.80 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్...

వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు..

ప్రజలకు మరింత చేరువగా బ్యాంకింగ్ సేవలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను...

పేద విద్యార్థుల విదేశీ విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ

మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధికి వనపర్తి నుంచి 8...

Related Articles

నరకానికి చిరునామా ‘చెన్నమ్మ సర్కిల్’: హైవే పై నిత్యం ట్రాఫిక్ నరకం.. ప్రాణాలు పోతున్నా నిద్రమత్తులో యంత్రాంగం!

పొలిటికల్ పవర్ (సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక) కర్నూలు జిల్లా | కల్లూరు ఎస్టేట్ ప్రత్యేక కథనం రిపోర్టర్: దస్తగిరి. పి (కర్నూలు) తేదీ: 05 నవంబర్ 2026బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై...

పసుమర్తి శ్రీనివాస్ రావు మృతి వ్యాపార, సామాజిక రంగాలకు తీరని లోటు: మాజీ మంత్రి వనమా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వనమా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్కొత్తగూడెం ( ) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఎస్‌కేఆర్...

పట్టభద్రుల హక్కులే లక్ష్యం : టీఆర్‌ఎస్ (డి) పార్టీ అధ్యక్షులు నరాల సత్యనారాయణనల్లగొండ–వరంగల్– ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్కొత్తగూడెం, నవంబర్ 5 ( ) నల్లగొండ, వరంగల్, ఖమ్మం...
error: Content is protected !!