ePaper
Saturday, November 7, 2026
📄 ePaper

అంకమ్మ చెరువుకు తక్షణ మరమ్మతులు చేపడతాం: మంత్రి తుమ్మల

📰 Generate e-Paper Clip

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన తుమ్మల.. పెద్దవాగు ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబుతో మరోసారి సమావేశం

పొలిటికల్ పవర్,అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున: మురసు తుఫాన్‌ కారణంగా తెగిపోయిన అశ్వారావుపేట సమీపంలోని అంకమ్మ చెరువును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం వేకువజామున స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి పరిశీలించారు. చెరువుకు గండి పడటంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. తెగిపోయిన చెరువుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, తిరిగి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా అక్కడి నుంచే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి అంకమ్మ చెరువు మరమ్మతులపై చర్చించారు. ఇటీవల తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న రహదారులు, చెరువులకు త్వరితగతిన మరమ్మతులు చేపడతామని తుమ్మల తెలిపారు.

అలాగే పెద్దవాగు ప్రాజెక్టు సమస్య పరిష్కారంపై స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును మరోసారి కలుస్తానని వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణను వెంట తీసుకెళ్లి, పెద్దవాగు ప్రాజెక్టు అంశంపై త్వరలోనే చంద్రబాబుతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రమేష్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, సీనియర్‌ నాయకులు, మంత్రి తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.

Latest Articles

కవయిత్రి మొల్ల విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు.. 11న భూమిపూజ

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా భూమిపూజకు సన్నాహాలు కుమ్మర కుల బంధువులంతా...

లక్షెట్టిపేట పట్టణ ప్రజలకు మరింత చేరువలో వైద్య సేవలు..నవంబర్ 7 :...

మట్టి ప్రమిదలు వెలిగిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం

చీకటిని పారద్రోలి వెలుగులను పంచే పండుగే దీపావళి -పలుస శంకర్ గౌడ్ పొలిటికల్ పవర్...

న్యాయవాద వృత్తిని వదిలి.. ప్రజాసేవే లక్ష్యంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ప్రస్థానం !

– విద్య, వైద్యం, మౌలిక వసతులు అన్ని రంగాల్లో దేవరకద్ర అభివృద్ధే...

ఈ నెల11న కుమ్మర ఇంటి ఆడపడుచు మహాకవయిత్రి మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ఠాపన

 ఎమ్మెల్యే. తూడి మేఘా రెడ్డి చేతుల మీదుగా భూమి పూజకు కార్యాచరణ...

Related Articles

మురసు తుఫాన్‌ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి!

ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్పొలిటికల్ పవర్,దమ్మపేట: మురసు తుఫాన్‌ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలను అశ్వారావుపేట...

error: Content is protected !!