
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక (గార్ల మండల ప్రతినిధి – మాలోత్ అజయ్ నాయక్):
దేశానికి సేవ చేసే సైనికులుగా ఎదిగేందుకు, అత్యుత్తమ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించే సైనిక పాఠశాలల (Sainik Schools) ప్రవేశాలకు ఊహించినట్లే భారీ నోటిఫికేషన్ విడుదలయింది! 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి మరియు 9వ తరగతులలో ప్రవేశాల కోసం నిర్వహించే ‘AISSEE 2027’ దరఖాస్తు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.
దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
ముఖ్యమైన వివరాలు ఒకే నజర్‌లో:
* దరఖాస్తుల ఆఖరు తేదీ: డిసెంబరు 3, 2026 (ఇంటర్నెట్/ఆన్‌లైన్ ద్వారా).
* అధికారిక వెబ్‌సైట్: దరఖాస్తు కోసం నేరుగా exams.nta.nic.in పోర్టల్‌ను సందర్శించగలరు.
* పరీక్ష తేదీ: జనవరి 31, 2027.
* పరీక్ష విధానం: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో ఓఎమ్‌ఆర్ (OMR) పద్ధతిలో (ఆఫ్‌లైన్) పరీక్ష నిర్వహణ.
* అదనపు ప్లస్ పాయింట్: ఈ పరీక్షలో ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ (Negative Marking) ఉండదు!
పరీక్ష రుసుము (Application Fee):
* జనరల్ / బీసీ (OBC) అభ్యర్థులకు: రూ. 850/-
* ఎస్సీ / ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు: రూ. 700/-
పొలిటికల్ పవర్ పిలుపు:
భావి భారత రక్షణ దళాలలో మెరవాలనుకునే విద్యార్థులకు సైనిక పాఠశాలలు బంగారు బాటలు వేస్తాయి. కాబట్టి గడువు ముగిసేవరకు వేచి చూడకుండా అర్హులైన విద్యార్థులందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ‘పొలిటికల్ పవర్’ ప్రతినిధి మాలోత్ అజయ్ నాయక్ కోరుతున్నారు!

