ePaper
Monday, November 9, 2026
📄 ePaper

సాంస్కృతిక కార్యక్రమాలు

📰 Generate e-Paper Clip

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 7 ( పొలిటికల్ పవర్ న్యూస్ )

దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధనలో) శృతిలయ కూచిపూడి నృత్యాలయం, విజయవాడ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడుతున్నది.

ఈ కార్యక్రమములో గం గం గణపతి, విజ్ఞరాజంబజీ, శివ శివశంకరా, శంభో..శివశంభో తదితర గీతాలకు, అష్టకాలకు కేశవ, సహస్ర, హర్షిణి, వర్షిత, జ్యోతి, మేఘన, లలిత తదితరులు నృత్యప్రదర్శన చేయనున్నారు.

అలాగే రెండవ కార్యక్రమములో భాగంగా సౌందర్య కూచిపూడి నృత్యనికేతన్, రాజమహేంద్రవరం వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఈ కార్యక్రమములో శివపంచాక్షరి, శంకరాశశిధర, ఓం నమ:శ్శివాయ, శివతాండవం తదితర గీతాలకు, అష్టకాలకు సఫల్య, పునర్విక, జస్వితి, ప్రకీర్తి తదితరులు నృత్యప్రదర్శన చేయనున్నారు.

కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.

శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహించ బడుతున్నాయి.

Latest Articles

సిఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు: పాలేరులో హోరెత్తిన సంబరాలు!

పాలేరు నియోజకవర్గం / దానవాయిగూడెం (59వ డివిజన్):తెలంగాణ రాష్ట్ర డైనమిక్ ముఖ్యమంత్రి,...

శంభునిగూడెంలో మిరుమిట్లు గొలిపిన దీపావళి సంబరాలు! చదువుల వెలుగులతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు..

 - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి ప్రతినిధి (కాకటి సత్యప్రసాద్):భద్రాద్రి కొత్తగూడెం...

జగ్గయ్యపేట ZPTCగా మండవ శ్రీనివాస్ ఘన విజయం! 1,108 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన మండవ

  పొలిటికల్ పవర్  ప్రతినిధి  జగ్గయ్యపేట :కృష్ణ  జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో...

అవ‌మానిస్తే 2 సార్లు రాజ్య‌స‌భ‌, 19 ప‌ద‌వులు వ‌స్తాయా..? – సాయిరెడ్డి ప‌చ్చి అబ‌ద్ధాలు

పొలిటికల్ పవర్ ప్రతినిధి తెలంగాణమాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సాయిరెడ్డి ప‌చ్చి అబ‌ద్ధాలు,...

ఖమ్మం నగరంలో బైపాస్ రోడ్డు లోని న్యూ విజన్ జూనియర్ కాలేజీ దగ్గర ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లేదా….??

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

దివ్య కాంతుల్లో చిన్న శ్రీను గారు, కుమార్తె సిరమ్మ’ కుటుంబ సమేతంగా జరుపుకున్న దీపావళి వేడుకలు

 విజయనగరం (ధర్మపురి): పొలిటికల్ పవర్ ప్రతినిధిచీకట్లను పారద్రోలుతూ వెలుగుల పండుగ దీపావళి విజయనగరంలో శోభాయమానంగా సాగింది. ధర్మపురిలోని 'సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్'లో ఆదివారం రాత్రి పండుగ వాతావరణం ఉరిమిన ఉత్సాహంతో...

అనంతారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లల్లో దీపావళి సంబరాలు నిర్వహించిన. సర్పంచ్ కొర్సా రమేష్.

  జూలూరుపాడు నవంబర్ 08 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సందర్భంగా. వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రంలో అనంతారం గ్రామంలో సర్పంచ్ కొర్సా రమేష్ ఆధ్వర్యంలో ..ఇందిరమ్మ ఇంట్లో దీపావళి.. సంబరాలు...

*బయలువీరభద్రస్వామివారి విశేషపూజలు

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 8 (పొలిటికల్ పవర్ న్యూస్)ఈ రోజు ఉదయానికి అమావాస్య ఘడియలు రావడంతో శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామి వారికి దేవస్థానం విశేషపూజలను నిర్వహిస్తున్నది. ఈ సాయంకాలం...
error: Content is protected !!