ePaper
Monday, November 9, 2026
📄 ePaper

అద్వాని జీవితం భాజపా కార్యకర్తలకు ఆదర్శ వంగ ఉండాలి

📰 Generate e-Paper Clip

 – ఉమ్మడి  మహబూబ్ నగర్, జిల్లా బీజేపీ      ఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 09.2026.భారత రత్న లాల్ కృష్ణ అద్వాని జీవితం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఆదర్శంగా నిలవాలని అద్వాని జీవితం భాజపా కార్యకర్తలకు ఆదర్శ వంగ ఉండాలి ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్ అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో ఆయన నూరువ జన్మదినం సందర్భంగా పట్టణ చౌరస్తాలో ఆయన చిత్రపటం దగ్గర కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంలోఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్ మాట్లాడుతూ 
1927 నవంబర్ 8 న జ్ఞాని దేవి కిషన్ అద్వాని పుణ్య దంపతులకు కారాచి లోని సింద్ పట్టణం లో మొదటి సంతానంగా జన్మించారు.1947 దేశ విభజన సందర్భం లో కారాచి లోని సొంత ఆస్తి, పాస్తులను వదలుకొని కట్టు బట్టలతో మహారాష్ట్రకు అద్వాని  కుటుంబం వచ్చి స్థిరపడ్డారని అన్నారు. ఉన్నత చదువులు చదువు తూనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ* కు పరిచయమై రాజస్థాన్ లోని అనేక జిల్లాలో ప్రచారక్ గా పనిచేశారు. గురూజీ కోరిక మేరకు భారతీయ జనసంఘ లో చేరారు. భారతీయ జనసంగ లో తదనంతరం భారతీయ జనతా పార్టీలో చురుకైన పాత్రను పోషించి, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కొరకు అవిశ్రాంతంగా పనిచేశారు.
సోమనాథ్ నుండి అయోధ్య వరకు వారు చేపట్టిన రథయాత్ర భారతీయ జనతా పార్టీకి పెద్ద మలుపు తిరిగిందన్నారు.

అద్వానీ ఆయుష్షును పెంచిన ఈటీవీ సంస్థ

ఈ సందర్భంగా ఒక ముఖ్య సంఘటనను గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని,14-02-1998 ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూర్ వెళ్లాల్సి ఉంది. కోయంబత్తూర్ బహిరంగ సభలో వారి షెడ్యూల్లో ఉన్నసమయానికే వారు అక్కడ ఉంటారని తెలిసి బిజెపి అంటే గిట్టని వారు బాంబు పేలుళ్లకు దిగారు. దాదాపు 58 మందికి పైగా మరణించారు.ఈనాడు దినపత్రిక వారు కొత్తగా ప్రారంభించిన ఈటీవీ కి ఇంటర్వ్యూ ఇవ్వడం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా కోయంబత్తూర్ కు చేరుకోవడం జరిగిందని, వారికి  ప్రమాదం తప్పింది. సభాస్థలి దగ్గరికి వెళ్ళవద్దని పోలీసు వారు ఎంత చెప్పినా క్షతగాత్రులను పరమార్శించ కుండా ఇక్కడి నుండి నేను వెళ్ళను. అని మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడం, వారికి ప్రగాఢ సానుభూతిని తెలపడం మరపురాని సంఘటన అని అన్నారు. 57 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎంతోమంది పార్టీ పెద్దలతో కలసి పనిచేసి,పార్టీని దేశంలో అగ్రస్థానంలో నిలిపిన ఘనత అద్వానీ గారిది.సంస్థాగత విషయాల్లో,సమస్యల పరిష్కార విషయం లో పార్టీ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీనీ, వాటిని వ్యక్తిగత సమస్యలుగా బావించకుండా, ఒకే ఆలోచనా విధానం తో పార్టీని ముందుకు తీసుకు పోయిన విషయం మనమందరం గుర్తుంచు కోవాలి. అదే దిశగా పనిచేయాలని,అద్వాని గారి 100 వ జన్మదినం సందర్బంగా, మన మందరం కార్యకర్తలము, నాయకులము ప్రతిన బూని వారి అడుగు జాడల్లో ప్రయనించి, పార్టీ నీ ఈ రాష్ట్రం లో అధికారం లోకి రావడానికి కృషి చేద్ధాం. కొత్తకోట లో జరిగిన కార్యక్రమం లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చెయ్యాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ ఉమ్మడి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు డాబా శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాములు యాదవ్, దామోదర్ రెడ్డి, సబి రెడ్డి వెంకట్ రెడ్డి, సత్యం సాగర్, రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Latest Articles

అశ్వరావుపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డ్ తూర్పు బజార్ నందు అభివృద్ధి...

తీవ్ర దిగ్భ్రాంతి.. కన్నీటి పర్యంతమైన బాధితులు: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బుక్యా సోమ్లా కుటుంబానికి కోరం సురేందర్ పరామర్శ!

 టేకులపల్లి (పొలిటికల్ న్యూస్ 9), పొలిటికల్ పవర్ బ్యూరో: తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం...

రైతుల సభకు మహిళా సంఘాల సభ్యుల తరలింపా?: ఏనుగు సుదర్శన్ రెడ్డి.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

రోడ్డు పక్కన  చెత్త డంపింగ్ యార్డు వెదజల్లుతున్న దుర్వాసన

– భీమాకలువప్రక్కనచెత్తడంపింగ్.యార్డ్.ఉండడంతో మాలధారణ ప్రారంభమైన అయ్యప్ప మాల వేసుకునే స్వాములు ఆలయానికి బాట పడుతున్న వేళ,  దుర్వాసన వెదజల్ల డంతో ఇబ్బందులు, – ఈ సమస్యకు కారణం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యమేనని ప్రజలు మండిపడుతున్నారు, పొలిటికల్...

తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.27 లక్షల నిధులు మంజూరు..

ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవతో 11 ప్రాంతాల్లో అత్యవసర పనులకు కలెక్టర్ ఆమోదం.... వనపర్తి నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుదలకు ప్రత్యేక చర్యలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

చలో కొడంగల్‌కు భారీగా తరలివెళ్లిన పామిరెడ్డిపల్లి గ్రామరైతులు, కాంగ్రెస్ నాయకులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 09 2026: పెద్దమందడి మండలం కొడంగల్‌లో నిర్వహిస్తున్న రైతు మేళా, ఇండస్ట్రియల్...
error: Content is protected !!