
హైదరాబాద్ / పొలిటికల్ పవర్ న్యూస్: నాగరాజు రెడ్డి
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కాకా’ షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..
షూటింగ్ అనంతరం శేఖర్ మాస్టర్ తన కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న ఓ పండ్ల లారీని ఆయన ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఊహించని ప్రమాదంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఊపిరి పీల్చుకున్న సినీ వర్గాలు:
అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌కు ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు. ఆయన స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ వార్త తెలియగానే చిత్ర యూనిట్ సభ్యులు, అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురైనప్పటికీ, ఆయన క్షేమంగా ఉన్నారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

