ePaper
Friday, November 13, 2026
📄 ePaper

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన మద్దిగట్ల–మోజర్ల విద్యార్థిని శ్రీవల్లి

📰 Generate e-Paper Clip

విద్యార్థినిని అభినందించిన ఉపాధ్యాయ బృందం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నవంబర్ 12 2026: పెద్దమందడి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల–మోజర్లకు చెందిన 8వ తరగతి విద్యార్థిని శ్రీవల్లి రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైంది. ఇటీవల వనపర్తి జిల్లాలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్‌–14 హాకీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు కామారెడ్డి జిల్లాలో రాష్ట్రస్థాయి హాకీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వనపర్తి జిల్లా జట్టు గురువారం కామారెడ్డికి బయలుదేరింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని శ్రీవల్లిని అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, వనపర్తి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాదరావు, ఉపాధ్యాయులు పి. వెంకటస్వామి, గద్వాల కృష్ణయ్య, వాణిప్రభ, పుల్లయ్య, కె. మధుసూదన్, ఎన్. వెంకటస్వామి, వ్యాయామ ఉపాధ్యాయులు, వి. మధుసూదన్, కృష్ణవేణి, చిన్నారెడ్డి, విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

మోజర్ల గ్రామంలో బాలల సభ నిర్వహణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి హామీ పనులకు శ్రీకారం -సర్పంచ్ చంద్రశేఖర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

బాబోయ్ పెద్దపులి..! అటవీ ప్రాంత గ్రామాల్లో మళ్లీ భయాందోళనలు

ఏపీలోని వేలేరుపాడు మండలం కొత్తూరు వద్ద మూడు ఆవులు హతం గోదావరి పరివాహక...

1/70 చట్టం జోలికొస్తే సహించేది లేదు!

ఆదివాసుల హక్కులు, భూముల పరిరక్షణ కోసం నవంబర్ 30న తహసీల్దార్ కార్యాలయం...

రూ.4 కోట్లతో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం

అశ్వారావుపేట మండలంలో విద్యుత్ సరఫరా మెరుగుదలకు చర్యలుఅశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ...

Related Articles

పామాపురం పీఏసీఎస్ నూతన చైర్మన్ నాగారపు   బీచుపల్లి యాదవ్ ను సన్మానించిన టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు యం. కిషన్ నాయక్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 14. 2026.పామాపురం పీఏసీఎస్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ నాగారపు   బీచుపల్లి యాదవ్...

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి హామీ పనులకు శ్రీకారం -సర్పంచ్ చంద్రశేఖర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 13 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో గ్రామ అభివృద్ధితో పాటు...

పాలమూరు జిల్లా ప్రజల ఇలవేల్పుగా..భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన కురుమూర్తి స్వామీ

– శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం బ్రహ్మోత్సవనికి ఆహ్వానo పలికిన పాలక మండలి మాజీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు కొత్తకోట,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి...
error: Content is protected !!