📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి:నిధి
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కేంద్రం. పవిత్ర కార్తీక మాసం, అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం నివాసి కొలిమార్ల బాజీ తన తండ్రి కీర్తిశేషులు కొలిమార్ల అంకామరావు జ్ఞాపకార్థం పేదలు, అభాగ్యులకు దుప్పట్లను వితరణ చేశారు.
చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీరామ దండు 108 కమిటీ సభ్యులు స్థానిక పట్టణంలో అర్హులైన పేదలకు దుప్పట్లను పంపిని చేశారు.
ఈ సందర్బంగా కమిటీ సభ్యుడు కట్టా రమేష్ మాట్లాడుతూ, తండ్రి తమకు దూరమైనట్టికి ఆయన జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల రూపంలో చిరస్థాయిగా నిలుపుతున్న కొలిమార్ల బాజీని అభినందించారు.
నేటిసమాజంలో కన్నవారిని పట్టించుకోని పరిస్థితులు కనిపిస్తున్నతరుణంలో, తండ్రి జ్ఞాపకార్థం పేదలకు సహాయం అందించడం ఆదర్శనియమని పేర్కొన్నారు. పవిత్ర కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు పది రెట్ల పుణ్యఫలాన్ని అందిస్తాయని విశ్వసిస్తారని, దాతలు శ్రీరామ దండు 108 కమిటీ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలో భాగస్వాములు కావాలని కోరారు.
తమ కమిటీ ద్వారా అందించే సహాయం నిజమైన అర్హులకు చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొదుకూరి రాకేష్, గౌరవ అగర్వాల్, కట్టా రమేష్ తదితరులు పాల్గొన్నారు.