డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై సాయి కిషోర్ రెడ్డి హెచ్చరిక
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ వడితే గణేష్ నవంబర్ 13 2026: అశ్వారావుపేట మైనర్ల చేతికి వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని అశ్వారావుపేట ఎస్సై బి. సాయి కిషోర్ రెడ్డి తల్లిదండ్రులను హెచ్చరించారు. 18 ఏళ్లు నిండని పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ:- మైనర్లకు బైక్‌లు ఇస్తే కఠిన చర్యలు తప్పవు.
– వాహనం నడిపే ప్రతి ఒక్కరికీ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
– మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
– హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం సహించేది లేదు.
– మైనర్ల చేతుల్లో వాహనాలు పెట్టి ప్రమాదాలకు కారణం కావద్దు.
తల్లిదండ్రులకు ప్రత్యేక హెచ్చరిక!
పిల్లలపై ప్రేమ ఉంటే వారి చేతికి మైనర్ల డ్రైవింగ్‌కు చెక్.. రోడ్డు భద్రతే లక్ష్యం!బైక్ తాళాలు ఇవ్వడం కాదు.. వారి భద్రతకు బాధ్యత తీసుకోవాలని ఎస్సై సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.


