ePaper
Friday, November 13, 2026
📄 ePaper

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జారె శ్రీకారం!

📰 Generate e-Paper Clip

మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన.. ఇంకుడు గుంతల పనులకు భూమిపూజ

నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి

పంచాయతీ కార్మికులతో కలిసి భోజనం చేసి వారి కష్టసుఖాలు తెలుసుకున్న ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున, అశ్వారావుపేట / దమ్మపేట: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దమ్మపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తహసీల్దార్ కార్యాలయాల్లో ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయంలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇంకుడు గుంతను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజలు ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్లలో నిత్యం వినియోగించే నీటిని వృథా చేయకుండా భూమిలోకి ఇంకేలా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

ఇంకుడు గుంతల నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ ప్రజలకు సహకారం అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని భూగర్భ జలాల పెంపునకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పంచాయతీ కార్మికులతో కలిసి భోజనం..

అనంతరం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మార్గమధ్యలో మందలపల్లి గ్రామంలోని ఓ హోటల్ వద్ద భోజనం చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులను గమనించి వారిని ఆప్యాయంగా పలకరించారు. వారితో కలిసి కూర్చొని భోజనం చేస్తూ వారి యోగక్షేమాలు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రజాప్రతినిధిగా తన హోదాను పక్కనపెట్టి సాధారణ కార్మికులతో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే తమతో కలిసి భోజనం చేయడంతో గ్రామపంచాయతీ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాల్లో అశ్వారావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, దమ్మపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కక్కిరాల రమేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పొదిలి జ్యోతి, అశ్వారావుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, జిల్లా బీసీసీ సభ్యుడు తుమ్మా రాంబాబు, దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి, రాంబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రెండు మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

మోజర్ల గ్రామంలో బాలల సభ నిర్వహణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి హామీ పనులకు శ్రీకారం -సర్పంచ్ చంద్రశేఖర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

బాబోయ్ పెద్దపులి..! అటవీ ప్రాంత గ్రామాల్లో మళ్లీ భయాందోళనలు

ఏపీలోని వేలేరుపాడు మండలం కొత్తూరు వద్ద మూడు ఆవులు హతం గోదావరి పరివాహక...

1/70 చట్టం జోలికొస్తే సహించేది లేదు!

ఆదివాసుల హక్కులు, భూముల పరిరక్షణ కోసం నవంబర్ 30న తహసీల్దార్ కార్యాలయం...

రూ.4 కోట్లతో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం

అశ్వారావుపేట మండలంలో విద్యుత్ సరఫరా మెరుగుదలకు చర్యలుఅశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ...

Related Articles

1/70 చట్టం జోలికొస్తే సహించేది లేదు!

ఆదివాసుల హక్కులు, భూముల పరిరక్షణ కోసం నవంబర్ 30న తహసీల్దార్ కార్యాలయం ముట్టడి ఆదివాసి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుపొలిటికల్ పవర్,దమ్మపేట,నవంబర్ 13: ఆదివాసుల హక్కులకు, చట్టబద్ధంగా కల్పించిన రక్షణలకు భంగం కలిగించే...

రూ.4 కోట్లతో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం

అశ్వారావుపేట మండలంలో విద్యుత్ సరఫరా మెరుగుదలకు చర్యలుఅశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ ఇంచార్జ్, మేడపురెడ్డి నాగార్జున:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పార్కలగండి (అచ్చుతాపురం) గ్రామంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన...

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు మంజూరు చేయాలి!

గ్రామానికి నాలుగే పెన్షన్లా? అర్హులందరికీ ఎప్పటికి న్యాయం చేస్తారు? ప్రభుత్వంపై బీజేపీ నాయకుడు తంబళ్ల రవి ఆగ్రహంపొలిటికల్ పవర్,అశ్వారావుపేట/దమ్మపేట, నవంబర్ 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన చేయూత సామాజిక భద్రత పెన్షన్లను రాజకీయాలకు...
error: Content is protected !!