ePaper
Saturday, November 14, 2026
📄 ePaper

శ్రీ అంకాళమ్మవారికి వైభవంగా విశేష పూజలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నంద్యాల జిల్లా నవంబర్ 14 2026: నంద్యాల జిల్లా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలం క్షేత్ర గ్రామదేవత శ్రీ అంకాళమ్మవారికి శుక్రవారం అభిషేకం, విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం దేవస్థానం ఆధ్వర్యంలో సర్కారీ సేవగా ఈ పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మహాగణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించి, అర్చక స్వాములు లోకకల్యాణం కోసం సంకల్పం పఠించారు. అనంతరం అమ్మవారికి పంచామృతం, పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి, విశేష అర్చనలు, కుంకుమార్చనలు, పుష్పాలంకరణ చేపట్టారు. శ్రీశైల ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న రహదారి చివర కుడివైపున ఉత్తరముఖంగా అంకాళమ్మవారి ఆలయం కొలువై ఉంది. ప్రకృతి శక్తికి ప్రతిరూపంగా పూజలందుకుంటున్న అమ్మవారిని భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. లోకమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, ప్రజలకు ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని అర్చక స్వాములు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Latest Articles

ఆత్మీయంగా సాగిన నిశ్చితార్థ వేడుక..నూతన జంటకు సోయం వీరభద్రం ఆశీస్సులు

 పొలిటికల్ పవర్,దమ్మపేట,నవంబర్ 14: దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామానికి చెందిన కూకలకుంట...

కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఫలించిన మంత్రి తుమ్మల కృషి

ఆరు ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసిన ఎయిర్పోర్ట్...

ప్రజా పాలన ప్రభుత్వంలో మంజూరైన కొత్త పింఛన్లు

పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9...

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పట్టించుకోని ప్రభుత్వం

పొలిటికల్ పవర్ న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్...

మంచి నీటి ఏద్దడి నివారణకు ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి..

సిపిఎం పినిరెడ్డిగూడెం గ్రామ శాఖ కమిటీ డిమాండ్... పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

చిన్నారి వైష్ణవి ప్రాణాలకు ఆపన్నహస్తం అందించండి

గుండెలో రంధ్రం.. రూ.10 లక్షలతో హార్ట్ సర్జరీ.. వైద్య ఖర్చులు భరించలేక...

Related Articles

ఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర… శత్రుచర్ల విజయరామరాజు! ఒక రాజకీయ ప్రస్థానం.. ఎన్నో పదవులు.. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం!

పొలిటికల్ పవర్   విజయనగరంఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, కొన్ని వ్యక్తిత్వాలు కేవలం రాజకీయ నాయకులుగానే కాకుండా ఒక ప్రత్యేక రాజకీయ అధ్యాయంగా నిలిచిపోతాయి. అలాంటి నాయకుల్లో శత్రుచర్ల విజయరామరాజు ఒకరు. దశాబ్దాల పాటు...

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహ రెడ్డి మర్యాదపూర్వకంగా...

ఈ సమావేశానికి సంబంధించిన ముఖ్య వివరాలు:* బాలుడి అనారోగ్యంపై వినతి: ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన వర్షిత్ అనే చిన్నారి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి వైయస్...

error: Content is protected !!