ఆరు ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసిన ఎయిర్పోర్ట్ అథారిటీ
సుజాతనగర్ వద్ద 667 ఎకరాలలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.
ఇక భూసేకరణ, ఇతర అంశాలపైనే సర్కారు దృష్టి.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గగన యానానికి రెక్కలు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ని పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన రామ్మోహన్ నాయుడు సాంకేతిక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిశీలనకు ఏవీఎస్ అధికారులను పంపించారు. గత నెలలో ఏవీఎస్ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాలను పరిశీలించి సుజాతనగర్ ను అనువైన ప్రదేశంగా గుర్తించి, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. సుజాతనగర్ వద్ద సుమారు 667 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. కేంద్రం నుంచి అనుమతి రావడంతో భూ సేకరణ మరియు ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. భద్రాచలం కొత్తగూడెం జిల్లా విమానాశ్రయ ఏర్పాటులో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.


