ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో వాల్మీకి బోయ సమస్యలు పరిష్కరించాలి

వాల్మీకి బోయిలకు రాష్ట్ర కార్పొరేషన్ లో చైర్మన్లలో చోటు కల్పించాలి

వాల్మీకి జయంతిని అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలి

వాల్మీకి బోయిలను ఎస్టి జాబితాలో పునరుద్ధరించాలి

హైదరాబాద్ ట్యాంక్ బండి పై మహర్షి వాల్మీకి విగ్రహం పెట్టాలి

మండ్ల దేవన్న నాయుడు. వాల్మీకి సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 03 మే 2016: రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో గురించి చర్చించాలని వాల్మీకి సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ ఉద్యమకారుల ఫోరం వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి మండ్ల దేవన్న నాయుడు. వాల్మీకి సంఘం వనపర్తి జిల్లా నాయకులు బుసిరెడ్డి స్వామి, బలరాం నాయుడు, తదితరులు ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రవేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలోదేవన్న నాయుడు మాట్లాడుతూ… దేశంలో చాలా రాష్ర్టాల్లో షెడ్యూల్డ్‌ ట్రైబల్స్‌గా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని కొన్ని జిల్లాల్లో గిరిజన తెగలుగా.. మరికొన్ని జిల్లాలో బీసీ-ఏలుగా పరిగణిస్తున్నారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1968 వరకు వీళ్లను అడవుల్లోంచి వచ్చిన ట్రైబ్‌లుగా, ఎస్టీలుగా గుర్తించింది. ఆ తర్వాత రాజకీయ కారణాలతో గిరిజన జాబితా నుంచి తొలగించారు. కొన్ని ప్రాంతాల్లో వీరిని వాల్మీకి, తలారి, కావలి, కిరాత, నిషాద, గురికార, పెద్దబోయ, చిన్నబోయ, యల్లాపి, నాయకర్‌ అని పలురకాల పేర్లతో పిలుస్తారు. భారత రాజ్యాంగ చట్టం 1951 జిఓ ఎంఎన్‌ 1527/1951 ప్రకారం వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించింది. 1968 వరకు బోయలు ఎస్టీలోనే కొనసాగారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎస్టీ జాబితా నుంచి బిసి-ఏ చేర్చారు దీంతో వారికి తీరని అన్యా యం జరిగింది. అప్పటి నుంచి ఎస్టీ జాబితాలో చేర్చి తగిన న్యాయం చేయాలి. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ల కోసం లక్షల మంది వాల్మీకిబోయలు ఆశతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో బీసీ కులగనన బీసీ మరియు ఎస్సీ వర్గీకరణ జరిగింది. చాలా సంతోషం. అలాగే వాల్మీకి బోయలను కూడా ఎస్టీ జాబితాలో తిరిగి పునరుద్ధరించాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించుకుంటున్నాం.  వాల్మీకి జాతిలో విద్యావంతులు చాలా తక్కువ మా పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరిచి. రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలోవాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో విరుద్ధరించాలని. కేంద్రంలో ఉన్న ఎస్టీ రిజర్వేషన్ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి పెంచి వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని. హైదరాబాద్ ట్యాంక్ బండి పై మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వాల్మీకి బోయలకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కేటాయించాలని మండ్ల దేవన్న నాయుడు ప్రభుత్వాలను కోరారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!