ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*బిగ్ బ్రేకింగ్: గన్‌పాయింట్ దోపిడీపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ – 2 కోట్ల ప్రాపర్టీ దొంగతనం… 50 గంటలు గడిచినా జాడ లేదు!*


  1. పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్.

హైదరాబాద్, మే 5: సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో కరీంనగర్‌లో జరిగిన సంచలన గన్‌పాయింట్ దోపిడీ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ జిల్లాలోని పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన ఈ ఘటనలో రెండు కోట్ల ప్రాపర్టీ దొంగతనం జరగగా, 50 గంటలు గడిచినా నిందితుల ఆచూకీ లభించకపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

 

ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వెంటనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

*“నందుర్బార్” క్లూ తో కొత్త మలుపు*

ఘటనా స్థలంలో దుండగులు వదిలేసిన బ్యాగుపై “ఐ లవ్ నందుర్బార్” అని రాసి ఉండటం కేసులో కీలక క్లూగా మారింది. దీంతో మహారాష్ట్రలోని నందుర్బార్ ప్రాంతంతో సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.16 బృందాలుగా గాలింపు – రాష్ట్ర సరిహద్దులు దాటి అన్వేషణ నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 16 బృందాలుగా విభజించి, దాదాపు 100 మంది సిబ్బందితో రాత్రింబవళ్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటి కూడా అన్వేషణ విస్తరించారు. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డుల విశ్లేషణ ద్వారా నిందితుల కదలికలను ట్రాక్ చేసే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి.ప్రజల్లో భయాందోళన – వ్యాపారుల ఆందోళన నగరంలో తుపాకులతో దోపిడీ జరగడం స్థానిక ప్రజల్లో భయాందోళనలకు దారి తీసింది. ముఖ్యంగా వ్యాపార వర్గాలు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.ఈ కేసు త్వరగా ఛేదించడమే ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది.

Latest Articles

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:వైరా నియోజకవర్గం జూలూరుపాడులో *బార్బర్స్ డే* సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద చెలగాటం! నిబంధనలకు నీళ్లొదులుతున్న అనధికార వాటర్ బాటిల్స్ వ్యాపారంప్రస్తుత కాలంలో ఎండాకాలం మాత్రమే కాదు, అన్ని కాలాల్లోనూ మంచినీటి అవసరం విపరీతంగా...
error: Content is protected !!