ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మోజర్ల గ్రామంలో దొంగతనం కలకాలం

ఇంటి తలుపులు తెరచి వెండి గొలుసులు, నగదు అపహరణ

 

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 11 2026: పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామంలో దొంగతనం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కానాయపల్లి రామచంద్రయ్య తండ్రి కుర్మయ్య వృత్తి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ప్రతి వారం స్వగ్రామానికి వచ్చి వ్యవసాయ పనులు, ఇంటి పనులు, చూసుకోవడంతో పాటు తన తల్లి అంజమ్మ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తిరిగి వెళ్తుంటారు. ఈ నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి కొత్తకోటలో ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లినట్లు సమాచారం. మరుసటి రోజు సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఫిర్యాదుదారుడి చెల్లెలు అటువైపు వెళ్తూ ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లోని బీరువా తెరిచి ఉండటం కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని అన్నయ్య అయినటువంటి కానాయపల్లి రామచంద్రయ్యకు తెలియజేయగా ఆయన అక్కడికి చేరుకుని పరిశీలించారు. అక్కడే చెట్టు ప్రక్కన ఉన్న తాళం తీసుకొని తలుపులు తెరిచి బీరువాలో ఉన్న సుమారు 15 తులాల వెండి గొలుసులు, మరికొంత నగదు కనిపించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు అనుమానం వచ్చి ఈ ఘటనపై స్థానిక పెద్దమందడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.

Latest Articles

*ప్రజయ్ వాటర్ ఫ్రంట్లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికే చెట్ల తొలగింపు.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

పేట్రేగిపోతున్న ఎక్సైజ్ కమిషనర్ అవినీతి అక్రమాలు

– ప్రభుత్వ నిబంధనలకు పాతర కాసులుఇచ్చినవారికిపోస్టింగ్స్,గంజాయికేసులోనూకమీషనర్,నాటకాలు,కోటి రూపాయలిస్తే కోర్టును మోసంచేసిన వారిని...

దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి...

వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి  

– పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ట్రాఫిక్‌కు...

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...
error: Content is protected !!