ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

వడదెబ్బ గురై వ్యక్తి ఆకస్మిక మృతి  నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థుల విజ్ఞప్తి పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి మే 17 గుబ్బగుర్తి గ్రామం: కొణిజర్ల మండలంలోని గుబ్బగుర్తి గ్రామానికి చెందిన పొన్నేబోయిన శ్రీను (40) ఈ రోజు ఉదయం వడదెబ్బ గురై ఆకస్మికంగా మృతి చెందారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న శ్రీను హఠాన్మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతుడికి భార్య విజయతో పాటు ఇద్దరు చిన్న కుమార్తెలు శ్రీలక్ష్మి (12), ఉమా మహేశ్వరీ (10) ఉన్నారు. కుటుంబం ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితిలో ఉండగా, శ్రీను మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీను కుటుంబం రోజువారీ కూలి పనులపై ఆధారపడి జీవనం సాగించేది. ఇప్పుడు కుటుంబ పోషణ, పిల్లల చదువులు, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో దాతలు, ప్రజాప్రతినిధులు, సేవా సంస్థలు ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా ప్రత్యేక సహాయం అందించాలని కోరుతున్నారు. సెల్ నెంబర్ 9949838307

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!