ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ

 

కమిషనర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి

అనుమతి లేని మినరల్ వాటర్ ప్లాంట్ లపై ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడంలేదని కమిషనర్ పై

క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు..

 

అనుమతి లేని మినరల్ వాటర్ ప్లాంట్ల పై చర్యలు తీసుకోవాలి.

 

సామాజిక ఉద్యమకారుడు వి.రాజశేఖర్ శర్మ

 

నాగర్ కర్నూల్ పట్టణంలోని అనుమతి లేని,నాణ్యత ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ ప్లాంట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక సామాజిక ఉద్యమకారుడు వి.రాజశేఖర్ శర్మ సోమవారం రోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు..

 

పట్టణంలో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని,వీటిలో చాలా వరకు ప్రభుత్వ అనుమతులు లేకుండా,కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్నాయని,నాచు పట్టిన ట్యాంకులలో నీటి నిల్వ,తుప్పు పట్టిన యంత్రాలు,ఏళ్ల తరబడి వాడుతున్న ప్లాస్టిక్ క్యాన్‌లతో ప్రజలకు స్వచ్ఛమైన నీరు పేరుతో కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారని పట్టణానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు వి.రాజశేఖర్ శర్మ తెలియజేశారు..

 

మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ISI మార్క్,ఫుడ్ సేఫ్టీ లైసెన్స్,కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తప్పనిసరని,అయితే చాలా వరకు ప్లాంట్లు ఈ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయని గతంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ కు వ్రాత పూర్వకంగా ద్వారా ఫిర్యాదు చేసినా..పట్టించుకోవడంలేదని చెప్పారు..

 

దీనివల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని,నాణ్యత లేని నీటితో అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వాపోయారు.

 

ఈ విషయంపై జిల్లా కలెక్టర్,పట్టణ మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి,అనుమతులు లేని,నిబంధనలు పాటించని అన్ని మినరల్ వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసి,వాటిపై కఠిన చర్యలు తీసుకుని,మూసివేయాలని,ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు..

 

వావిలాల రాజశేఖర్ శర్మ,నాగర్ కర్నూల్ జిల్లా..!

Latest Articles

వేలంపల్లి గ్రామ సర్పంచ్ కూర వెంకటరాజిరెడ్డి చేతుల మీదుగా 30 మంది లబ్ది దారులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు పంపిణి

పొలిటికల్ పవర్పత్రిక ప్రతినిధి ఎల్ల స్వామి టేకుమట్లజిల్లా:జయశంకర్ భూపాలపల్లి:20 సెప్టెంబర్26 టేకుమట్ల...

టిమ్స్ హాస్పిటల్ లో చోరీ కలకలం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

దురదపాడు గణేష్ మండపంలో విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న  సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, దురదపాడు...

వరంగల్ ఎం జి ఎం ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి ఆరోగ్య శ్రీ వార్డులో పై కప్పు పెచ్చులు ఊడి పడి ముగ్గురికి గాయాలు

వరంగల్, సెప్టెంబర్ 20:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక &...

రైజింగ్ స్టార్ యూత్ మరియు శ్రీ సాయి గణేష్ భక్తమండలి ఆధ్వర్యంలో...

దురదపాడు  విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్న మాజీ జడ్పీటీసీ పైడి

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20:దమ్మపేట మండల పరిధిలోని దురదపాడు గ్రామంలో గ్రామస్తులు...

Related Articles

కొత్తూరులో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం..

పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీలకు ఘన సన్మానం పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20: దమ్మపేట మండలం కొత్తూరు గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ...

గణనాథుడిని దర్శించి.. బాధితులను పరామర్శించిన సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20 :అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పార్కల గండి గండి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం సుడిగాలి పర్యటన చేశారు.గ్రామస్థుల ఆహ్వానం మేరకు పార్కలగండి గణేష్ మండపం...

తమిళనాడులో టీవీకే పార్టీ ముఖ్య నేత రమేష్ కుట్టితో మద్దిశెట్టి సామేలు భేటీ

 పొలిటికల్ పవర్, సెప్టెంబర్, 20: చెన్నై / తమిళనాడు:తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే పార్టీ ముఖ్య నేత రమేష్ కుట్టితో ఎన్సీపీ పార్టీ...
error: Content is protected !!