మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.

రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. అనంతరం మీడియాతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో *సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్‌కు* సంబంధించి రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.
ఎకరానికి రూ.1 లక్ష చొప్పున *మొత్తం రూ.30 లక్షలు డిమాండ్* చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.
ఈ వ్యవహారంలో *తహసీల్దార్ డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.* కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని, *ఎమ్మార్వో సుచరితతో పాటు ఆర్డిఓ కీసర రాజేష్ పలువురు సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు.*
పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా…
*2024లో కూడా శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ఎమ్మార్వో సత్యనారాయణ రూ.2 లక్షల లంచం కేసులో డ్రైవర్‌తో కలిసి ఏసీబీకి చిక్కిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.*
తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
