ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

తొలితరం విప్లవకారుడు హేతువాద ఉద్యమ ప్రముఖుడు

*కా,,క్రాంతి కార్ కి*, పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి సీపీఐ{ఎంఎల్} న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ *పక్షాన వినమ్రంగ*

*విప్లవ జోహార్లర్ఫిస్తుంది*l

డా.డామాబు లక్మయ్య,కా,,క్రాంతికార్ ,తీవ్రమైన అస్వస్థత తో ఖమ్మం లోని ఆరాధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం చనిపోయారు. ఆయన మరణం పట్ల *సీపీఐ{ఎంఎల్}* *న్యూడెమోక్రసీ కా,, చంద్రన్న పార్టీ,జిల్లా కమిటీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తుంది*

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామంలో కామ్రేడ్ క్రాంతి కార్ జన్మించారు. విద్యార్థిదశలోనే నక్సల్భరీ విప్లవోద్యమం వైపు ఆకర్షించబడ్డారు.

ఆయన నక్సలైట్ ఉద్యమం లో కీలక వ్యక్తి.ఈయన1970దశకంలో ‘నక్సల్భరీ’ అనబడే మాసపత్రిక నడిపారు1972 లో విరసం ఏర్పాటు సందర్భంగా తొలిమహాసభ ఖమ్మం లోనే జరిగింది.దీనినిర్వాహణలో ప్రముఖ పాత్ర వహించారు.డా.కోవూర్ తో కలిసి 1980దశకంలో హేతువాద ఉద్యమ విస్తరణకు కృషి చేశారు.పుస్తకాలు అన్నా, పుస్తక పఠనం చాలా ఇష్టం .హేతువాదం పత్రిక సంపాదకుడు గా సుదీర్ఘ కాలం పనిచేశారు.మూఢనమ్మకాలపై పోరాటం చేశారు.నిప్పులమీద నడక తదితర కార్యక్రమాలు తోపాటు అనేక హేతువాద సభలకు ఆయన ఆద్యుడు.

ఖమ్మం లోనే ఆయన హోమియో డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారు.ఆయన నియమ బద్ధమైన జీవితం గడిపారు.పలుపుస్తకాల రచయిత గా ప్రసిద్ధుడు.మతాలకు,వాటిమౌఢ్యాలకు వ్యతిరేకంగా పోరాడారు.ఆయనపలుమార్లు జైలు జీవితం సైతం గడిపారు.

ఖమ్మంజిల్లాలో ఎక్కడ సభలు జరిగినా హేతువాద పుస్తకాలు ప్రదర్శనతో ఆయన ప్రత్యక్షం అయ్యేవారు.జిల్లాలో , విప్లవోద్యమం తొలితరం నాయకుడుగా క్రాంతి కార్ ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు.ఆయన జీవిత సహచరి ఝాన్సీ రాణి రిటైర్డ్ లెక్చరర్ గా పనిచేశారు వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు,ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు నష్టకరమైంది హేతువాద ఉద్యమానికి తీవ్రమైన లోటు,కా,,క్రాంతి కార్ కి మరొక్కసారి

సీపీఐ{ఎంఎల్} న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ పక్షాన విప్లవ జోహార్లు*

కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తున్నాం.

 

Latest Articles

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్ను అకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి సంపత్ రావు

 *పొలిటికల్ పవర్ ప్రతినిధి టేకుమట్ల ఎల్లస్వామి*శనివారం 19...

ఖమ్మం నగరం లోని శ్రీనివాస్ నగర్ ఇండ్ల సమస్యపై భవిష్యత్తు కార్యాచరణ చేపడతాం – నున్నా, వై విక్రమ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయం.. ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు తీర్పు పై సవాల్

హైదరాబాద్: పొలిటికల్ పవర్ ప్రతినిధి నాగరాజు రెడ్డితన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు...

Related Articles

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు నూతన జిల్లా యువజన అధ్యక్షులను నియమించారు. జాతీయ ఎన్వైసీ అధ్యక్షులు ధీరజ్...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్ను అకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి సంపత్ రావు

 *పొలిటికల్ పవర్ ప్రతినిధి టేకుమట్ల ఎల్లస్వామి*శనివారం 19 సెప్టెంబర్టేకుమట్ల మండల పోలీస్ స్టేషన్ డిఎస్పి సంపత్ రావు పోలీస్ స్టేషన్ రికార్డులు.పోలీస్ స్టేషన్లో .శాంతిభద్రతలపోలీసుల పనితీరు పల అంశములపై...

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు పరిష్కరించాలి: మద్దిశెట్టి సామేలు

మద్దిశెట్టి సామేలు ఆధ్వర్యంలో 6 వేల మంది పూజారులతో భారీ బహిరంగ సభ పొలిటికల్ పవర్ సెప్టెంబర్,19:తెలంగాణ: గిరిజన శివశక్తుల పూజారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మద్దిశెట్టి శామ్యూల్ ఆధ్వర్యంలో...
error: Content is protected !!