ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

📰 Generate e-Paper Clip

అడవి అజిలాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన కార్యక్రమంలో డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ మే 30 2026: రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పేర్కొన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని అడవి అజిలాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని తెలిపారు. నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ ప్రాజెక్టు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, పశుసంవర్ధక, పాడీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన శాఖల మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని చిన్నారెడ్డి తెలిపారు. అడవి అజిలాపూర్ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు పెరగడం ద్వారా రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. ఈ పథకం పనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తి అయ్యేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి సూచించారు. దేవరకద్ర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

Latest Articles

కలసపాడు నూతన ఎస్సైగా హనుమంతు

కలసపాడు సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ 9 టీవీ తెలుగు జాతీయ...

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

Related Articles

శ్రీరంగాపూర్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు

వినాయక ఉత్సవ కమిటీకి పలుస శంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్...

సుమిత్ర పార్థివ దేహానికి జిల్లా విద్యాశాఖ అధికారి యదయ్య నివాళులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 19 2026: పెబ్బేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు), పెబ్బేరులో...

ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర...
error: Content is protected !!