ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

ఆదివాసి ఎమ్మెల్యేలు ఇకనైనా నోరు విప్పండి: పాయం

📰 Generate e-Paper Clip

భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటుకు కొనసాగుతున్న పాదయాత్ర

పొలిటికల్ పవర్, దుమ్ముగూడెం, ఆగస్టు 19:

భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. నడికుడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర రేగుబల్లి, సీతారాంపురం, నర్సాపురం, కన్నాయిగూడెం, సీతంపేట, చింతలగూడెం మీదుగా చెన్నంపేట వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ.. భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై ఆదివాసీ ఎమ్మెల్యేలు ఇకనైనా స్పందించాలని కోరారు. పాదయాత్ర ద్వారా ప్రజల ఆకాంక్షలు, న్యాయ కళాశాల అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ పాదయాత్రను చూసైనా ఆదివాసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో న్యాయ కళాశాల ఏర్పాటుపై గళం విప్పి, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 20న పాదయాత్ర భద్రాచలం చేరుకుని అక్కడి నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు కొనసాగుతుందని పాయం సత్యనారాయణ తెలిపారు. న్యాయ కళాశాల ఏర్పాటు కోసం చేపట్టిన ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలోని గిరిజనులు, పేదలు, విద్యార్థులకు న్యాయ విద్య అందుబాటులోకి వస్తుందని, న్యాయ రంగంలో స్థానిక యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని నాయకులు పేర్కొన్నారు. ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన న్యాయ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు.

  1. ఈ పాదయాత్రలో గొండ్వానా సంక్షేమ పరిషత్ ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సొందే వీరయ్య, జిల్లా అధ్యక్షులు భీరబోయిన శేఖర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గొంది లీలా ప్రసాద్, పాయం సన్యాసి, సున్నం సుబ్బయ్య, కారం సుధ, కారం సాయమ్మ, పోడియం రామ్ అక్క తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు యత్నం.. ముగ్గురి అరెస్ట్

రెండు నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనంపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...

పేదోడి గుడిసెలో వెలుగు నింపాలని కరెంట్ డిపార్ట్మెంట్ ఎడిఇ కి కాలని ప్రజలు వినతిపత్రం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్.9 టివి న్యూస్...

అన్నపురెడ్డిపల్లిలో ప్రగతి పరుగులు.. దుమ్ము బాధలకు చరమగీతం!

  ● రూ. 5.80 కోట్లతో మండల కేంద్ర ప్రధాన రహదారికి మహర్దశ ●శరవేగంగా...

జిల్లాస్థాయిభజనపొటీలలోముమ్మళ్ళపల్లి గ్రామం శ్రీ గురు హరి భజన మండలి సభ్యులకు ప్రశాంశ పత్రలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి...

🚨 రాప్తాడు రణక్షేత్రం: స్కూలే లక్ష్యంగా ఉన్మాది పైశాచికత్వం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం!

 అనంతపురం, అక్టోబర్ 31: పొలిటికల్ పవర్  ప్రతినిధి నాగరాజు రెడ్డిచదువుకోవాల్సిన బడి...

Related Articles

అన్నపురెడ్డిపల్లిలో ప్రగతి పరుగులు.. దుమ్ము బాధలకు చరమగీతం!

  ● రూ. 5.80 కోట్లతో మండల కేంద్ర ప్రధాన రహదారికి మహర్దశ ●శరవేగంగా సెంట్రల్ లైటింగ్, బీటీ రోడ్డు నిర్మాణం ● దుమ్ము వల్ల నరకం తప్పిందని హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు, వ్యాపారులుఅశ్వరావుపేట, పొలిటికల్...

నారాయణపురంలో పటేల్ జయంతి.. ఇందిరా గాంధీకి ఘన నివాళి

మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన సర్పంచ్ మడకం కుమారిపొలిటికల్ పవర్,నారాయణపురం, అక్టోబర్ 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి, మాజీ ప్రధాని...

error: Content is protected !!