ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్విభజన హామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి.

విభజన హామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి.

📰 Generate e-Paper Clip


. ఈనెల 11వ తేదీ చలో జమ్మలమడుగు జయప్రదం చేయండి.
డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనాల శివకుమార్.

బద్వేల్ పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లాభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనాల శివకుమార్ లు డిమాండ్ చేశారు
శుక్రవారం బద్వేల్ పట్టణంలో డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ మహాసభ స్థానిక సుందరయ్య భవనం నందు నిర్వహించడం జరిగింది . ఈ మహాసభకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనాల శివకుమార్ లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పొందుపరిచినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వీటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తి అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని వారన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ పైన దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యంగా వస్తుందన్నారు అలాగే ఈనెల 11వ తేదీన డివైఎఫ్ఐ ఎనిమిదవ జిల్లా మహాసభలు జమ్మలమడుగు పట్టణంలో జరుగుతున్నాయి ఈ మహాసభలకు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ సమావేశంలో పాల్గొన్నవారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే నాగేంద్రబాబు ఆవాస్ జ్ జిల్లా అధ్యక్షులు పి చాంద్బాషా డివైఎఫ్ఐ పట్టణ నాయకులు మస్తాన్ షరీఫ్ ఆదిల్ యువరాజ్ సుధాకర్ సురేష్ నాగేంద్ర శివకుమార్ ఓబుల్ రెడ్డి ఫాతిమా అరుణ నాగేశ్వరి నాగరత్నమ్మ మాధవి కృష్ణవేణి కళావతి తదితరులు పాల్గొన్నారు.

బద్వేల్ డివైఎఫ్ఐపట్టణ నూతన కమిటీ ఎన్నిక.

పట్టణ అధ్యక్షులుగా: ఎస్కే మస్తాన్ షరీఫ్
పట్టణ కార్యదర్శిగా : ఎస్ కే ఆదిల్
పట్టణ ట్రెజరర్ గా : షేక్ ఫాతిమా
పట్టణ ఉపాధ్యక్షులుగా: యువరాజ్ సుధాకర్
పట్టణ సహాయ కార్యదర్శులుగా : సురేష్ నాగేంద్ర
మరో 15 మందిని పట్టణ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!