కలసపాడు జూలై 11 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ సమగ్ర జాతీయ దినపత్రిక .రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. కడప జిల్లా.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిలుగా ప్రకటించిన వారిలో బద్వేల్ నియోజకవర్గానికి చెందిన మంచూరి సూర్యనారాయణ రెడ్డి పేరును ప్రకటించడంపై కలసపాడు మండలంలోని డి సి సి చైర్మన్ వర్గీయులు స్థానిక కొత్తకోట సొసైటీ ప్రెసిడెంట్ దుగ్గిరెడ్డి, ప్రహల్లాద రెడ్డి, రామ సుబ్బయ్య మరియు టిడిపి కార్యకర్తల ఆధ్వర్యంలో కూ డలి వద్ద ఆనందోత్సవాలతో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి సరైన రథసారథి దొరకడం మన అందరి అదృష్టమని ఆయన అడుగుజాడల్లో పార్టీని బలోపేతం చేయాలని మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సభ్యులమని అందరం కలిసికట్టుగా పనిచేస్తే దేన్నైనా సాధించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

