పొలిటికల్ పవర్,ములకలపల్లి, ఆగస్టు 19:
ములకలపల్లి మండలం పాత్తూరు గ్రామంలో కొండ్రు వసంత గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బూర్గంపహాడ్–అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు వారి పార్థివదేహానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వసంత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంజా రవి, సోయం చిన్నారి, దుబ్బా బాబు, ఊకె ముక్తేశ్వరరావు, కొండ్రు భాస్కర్,శ్రీనివాస్, తదితరులు పాల్గున్నారు..
