బిక్కవోలు, జూలై 16: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని సంత మార్కెట్ ప్రాంతానికి చెందిన పంచాయతీ వాటర్ ట్యాంక్ నుంచి సరఫరా అవుతున్న తాగునీటిలో పెద్ద జలగ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.
పంచాయతీ ద్వారా ప్రజలకు అందిస్తున్న తాగునీటిలో జలగ రావడంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తాగునీటి నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఇలాంటి ఘటనలు ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే సంబంధిత అధికారులు వాటర్ ట్యాంక్‌ను పూర్తిస్థాయిలో శుభ్రపరచి, తాగునీటి నాణ్యతను పరీక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
