బద్వేల్ పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా 8వ మహాసభలో ఆగస్టు 10 11 వ తేదీలలో జమ్మలమడుగు పట్టణంలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల అధినేత సాయి కృష్ణ గారు డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కాలువ నాగేంద్రబాబు లు హాజరయ్యారు . ఈ కార్యక్రమం శ్రీ రాచపూడి డిగ్రీ అండ్ పీజీ నాగభూషణం కళాశాల ఆవరణంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ కళాశాల విద్యాసంస్థల అధినేత సాయి కృష్ణ గారు మాట్లాడుతూ…. డివైఎఫ్ఐ యువజన సంఘం జిల్లా మహాసభలు జయప్రదం కావాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు దేశ భవిష్యత్తు నేటి యువతపై ఆధారపడి ఉందని అన్నారు అటువంటి యువత తమ శక్తిని నిర్వీర్యం చేసుకుంటున్నారని అన్నారు అసాంఘిక కార్యక్రమాలకు బానిసవ్వకుండా మంచి సమాజం కోసం పాటుపడాలని అందులో యువతి యువకులు భాగస్వామ్య అవ్వాలని వారు కోరారు
*.డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే నాగేంద్రబాబు.* లు మాట్లాడుతూ….. మొట్టమొదటిసారిగా జమ్మలమడుగు వేదిక గా ఆగస్టు 10 11 తేదీలలో రెండు రోజులపాటు మహాసభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకత్వం హాజరవుతారని జిల్లాలోని డివైఎఫ్ఐ నాయకత్వం ప్రతినిధులు హాజరవుతారని నిరుద్యోగ సమస్య అజెండాగా మహాసభలలో చర్చించడం జరుగుతుందని అన్నారు నిరుద్యోగ యువతీ యువకులు అందరు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్, ఎస్.కె ఆదిల్, బద్వేల్ రూరల్ అధ్యక్షులు ముడుమాల ఓబుల్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు సుధాకర్, సుబ్రమణ్యం, బాల గురవయ్య, తదితరులు పాల్గొన్నారు.
