మేడ్చల్ డిపో సిబ్బంది నిజాయితీకి నిదర్శనం…
టీజీఎస్‌ఆర్టీసీ మేడ్చల్ డిపోకు చెందిన 215/2 సర్వీస్ బస్సు లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు
పటాన్‌చెరువు నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న బస్సులో కేపీహెచ్‌బీ వద్ద ప్రయాణికుడు ప్రశాంత్ బ్యాగ్‌తో ఎక్కి, రాత్రి 1:15 గంటల సమయంలో పట్నీ వద్ద దిగిపోయాడు,అనంతరం బస్సు సికింద్రాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో పటాన్‌చెరువు వైపు వెళ్తుండగా, కండక్టర్ చింతం గోవింద్ బస్సులో ప్రయాణికుడు వదిలివెళ్లిన బ్యాగ్‌ను గుర్తించి,వెంటనే విషయాన్ని డిపో అసిస్టెంట్ మేనేజర్ సీఐ జి. రామారావుకు మరియు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించడం జరిగిందని అన్నారు.
మరుసటి రోజు బ్యాగ్‌ను విజిలెన్స్ సిబ్బంది నరసింహకు అప్పగించగా, బ్యాగ్‌ను పరిశీలించినప్పుడు అందులో సుమారు రూ.2 లక్షల నగదు,ఆపిల్ ల్యాప్‌టాప్, రెండు పర్సులు,చార్జర్,కొత్త దుస్తులు, ఆఫీస్ ఐడీ కార్డు తదితర విలువైన వస్తువులు ఉన్నట్లు గుర్తించినట్లు అన్నారు.బ్యాగ్‌లో లభించిన కాంటాక్ట్ నంబర్ ద్వారా ప్రయాణికుడు ప్రశాంత్ సంప్రదించి, అసిస్టెంట్ మేనేజర్ సీఐ జి. రామారావు ఆయనను డిపోకు పిలిపించారు. ప్రయాణికుడు ప్రశాంత్ సమక్షంలో బ్యాగ్‌ను పరిశీలించి, అందులోని నగదు మరియు విలువైన వస్తువులను సురక్షితంగా తిరిగి అప్పగించడం జరిగిందని అన్నారు.తన విలువైన వస్తువులు, రూ.2 లక్షల నగదు సురక్షితంగా తిరిగి లభించడంతో ప్రయాణికుడు ప్రశాంత్ ఎంతో హర్షం వ్యక్తం చేసి, మేడ్చల్ డిపో సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సీఐ జి. రామారావు, ఎర్నింగ్ సెక్షన్ తిరుపతయ్య, కంట్రోలర్ అనిల్, శ్రీనివాస్ మరియు మేడ్చల్ డిపో సోషల్ మీడియా ఇన్‌చార్జి ఆనంద్ పాల్గొన్నారు.ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఎండి ఇస్మాయిల్ మరియు కండక్టర్ చింతం గోవిందు మాట్లాడుతూ,ప్రయాణికుల భద్రతే మా లక్ష్యం… నిజాయితీయే మా బలం అని అన్నారు.
కండక్టర్ గోవింద్ , డ్రైవర్ ఎం.డి. ఇస్మాయిల్ మరియు మేడ్చల్ డిపో సిబ్బందిని పలువురు ప్రశంసించారు.
