నాలుగు దశాబ్దాలుగా పామాయిల్ సాగు కు కృషి చేస్తున్న ఆలపాటి !!!!
ప్రభుత్వ పరిశీలనలో ఆలపాటి పేరు???
పొలిటికల్ పవర్, జూలై 11:
త్వరలో ప్రభుత్వం రాష్ట్రస్థాయి చైర్మన్ లను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ రేసులో తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ గ ఆయిల్ ఫెడ్ చైర్మన్ రేసులో ముందు ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. స్వతహాగా ఆయిల్ ఫామ్ రైతు అయినా ఆలపాటి నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో పామాయిల్ సాగు విస్తీర్ణం కోసం విశేష సేవలు అందించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ఆయిల్ ఫామ్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ఢిల్లీలో పలుమార్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను పలుమార్లు కలసి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తూ, తెలంగాణ ప్రాంత పామాయిల్ రైతులకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. గత ఐదు సంవత్సరాల క్రితం దమ్మపేట మండల పరిధిలోని అప్పారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఆలపాటి కీలకంగా వ్యవహరించారు. పామాయిల్ రైతుల స్థితిగతులు, పామాయిల్ పంటలో మెలకువలు తెలుసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని నియమించి మలేషియాలో సాగుపై అధ్యయనం చేసేందుకు ఆ కమిటీని ఏర్పాటు చేయగా మంత్రి తుమ్మల మరియు ఇతర అధికారులతో కలిసి మలేషియా వెళ్లి పామాయిల్ పంటపై అధ్యయనం చేసి వాటి వివరాలను ఈ ప్రాంత పామాయిల్ రైతులకు వివరించి, పామాయిల్ రైతులకు అధిక లాభం వచ్చే విధంగా చర్యలు చేపట్టారు. గత ఐదు నెలల క్రితం భారత రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతులమీదుగా రైతు నేస్తం కార్యక్రమంలో ఉత్తమ రైతుగా అవార్డు అందుకున్నారు. పామాయిల్ సాగు విస్తీర్ణం పెంచడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండగా ఆ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలని సంకల్పంతో ఉన్న ప్రభుత్వం ఆలపాటి కి ఆయిల్ ఫెడ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తే లక్ష్యం నెరవేరే దిశగా చర్యలు చేపడతారని ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

