ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంవిద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి*.

విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి*.

📰 Generate e-Paper Clip

*పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ విమలాదేవి*
*పాత పాల్వంచ జెడ్. పి హైస్కూల్ లో పేరెంట్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కొత్వాల విమలాదేవి*

19 జూలై 2026. ఎన్ వి ఆర్ న్యూస్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ . పొలిటికల్ పవర్ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని *కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి అన్నారు.* పాతపాల్వంచ లోని *జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో శనివారం తల్లిదండ్రులతో సమావేశం* నిర్వహించారు. ఈ సమావేశంలో *ముఖ్యఅతిథిగా పాల్గొన్న విమలాదేవి* మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం పట్ల అనేక సదుపాయాలను కలిగిస్తున్నదనీ, వారికి మంచి *యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, క్రీడలకు మంచి గ్రౌండ్ లు* ఏర్పాటు చేస్తున్నదని విద్యార్థులు, తల్లిదండ్రులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని *విమలాదేవి* అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను కుటుంబ సభ్యులుగా పరిగణించాలనీ సంఘంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో *47వ డివిజన్ కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు (జీ.వి), పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మలత,ఉపాధ్యాయులు బి. రాజు, కే.శాంతకుమారి, కాల్వ.సుందరమ్మ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆదిలక్ష్మి, జి.గౌరీ, గ్రామస్తులు బూసి శ్రీను, యాటా నాని, కోడూరి లక్ష్మణ్,* తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!