పొలిటికల్ పవర్, ఆగస్టు 20,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పట్వారి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో సీతారామ ప్రాజెక్టు పంట కాలువల నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులు తమ సమస్యలను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దృష్టికి తీసుకువచ్చారు. సీతారామ ప్రాజెక్టు పంట కాలువల నిర్మాణం వల్ల తమ సాగుభూములు కోల్పోతున్న రైతులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. తమ భూములను ప్రాజెక్టు కోసం తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో తమ జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని, ప్రభుత్వం నుంచి అందే పరిహారం, పునరావాసం తదితర అంశాల్లో తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు.రైతుల సమస్యలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఓపికగా విని, వారి వినతులను పరిశీలించారు. ప్రాజెక్టు అభివృద్ధి కోసం భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తరఫున అందాల్సిన ఆర్థిక సహాయం, పరిహారం రైతులు సంతోషించే విధంగా ఉండేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు న్యాయబద్ధమైన పరిహారం అందేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటి వసతులు మెరుగుపడి రైతులకు భవిష్యత్‌లో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, అదే సమయంలో ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతుల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.రైతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిహారం నిర్ణయం మరియు ఇతర అంశాల్లో రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలను స్వయంగా విని, ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
Homeఎడిటోరియల్సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసిత రైతులు సంతోషపడేలా ఆర్థిక సహాయం అందేలా చేస్తా: ఎమ్మెల్యే జారె
సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసిత రైతులు సంతోషపడేలా ఆర్థిక సహాయం అందేలా చేస్తా: ఎమ్మెల్యే జారె
0
9
Most Popular
- Advertisment -
