– ఎల్‌నినో ప్రభావంతో వరికి బదులుగా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 21.2026.వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు వ్యవసాయ అవసరాలకు నీటిని అందుబాటులో ఉంచేందుకు ఫారం పాండ్లు ఉపయోగపడతాయని, కాబట్టి జిల్లాలో వాటి నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.గురువారం పానగల్ మండలం గోప్లాపూర్ గ్రామంలో వివిధ రంజి వీబీజీ రామ్ జీ (గ్రామీణ ఉపాధి పథకం) కింద చేపడుతున్న ఫారం పాండ్ నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.ఫారం పాండ్ నిర్మాణం చేయించుకుంటున్న రైతు పల్లవితో కలెక్టర్ మాట్లాడి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనకున్న రెండు ఎకరాల భూమిలో రెండు గుంటల విస్తీర్ణంలో ఫారం పాండ్ నిర్మిస్తున్నట్లు రైతుతెలిపారు. ఫారం పాండ్ ద్వారావర్షపునీటినినిల్వచేసుకోవడంతో పాటు భూగర్భ జలాల పెంపు, బోర్ల రీచార్జ్‌కు, వ్యవసాయ అవసరాలకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని రైతు పల్లవి వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫారం పాండ్ నిర్మాణంపై ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి మరిన్ని పాండ్లనిర్మాణానికిచర్యలుతీసుకోవాలనిఅధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఫారం పాండ్ల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాకు నిర్దేశించినఫారంపాండ్లనిర్మాణ లక్ష్యాన్ని నిర్ణీత గడువులోగాపూర్తిచేయాలనిఅదనపు కలెక్టర్‌ను ఆదేశించారు.ప్రస్తుత పరిస్థితుల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులు వరి సాగుకు దూరంగా ఉండి వేరుశెనగ, పెసర, కంది వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా నీటి కొరతతో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడంతో పాటు రైతులఆదాయాన్నికాపాడుకోవచ్చనితెలిపారు.అనంతరం కలెక్టర్ గోప్లాపూర్ లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని వంటగదిని పరిశీలించి విద్యార్థులకు భోజనం గ్యాస్ స్టవ్‌పై వండుతున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, వంటగది పరిశుభ్రతను పరిశీలించారు.విద్యార్థులకునాణ్యమైన,పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, వంటగది పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ యాదయ్య, డిప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్, ఇతర అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.




