ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయని సీతారామ ప్రాజెక్ట్.
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్-9 టీవీ తెలుగు న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
సీతారామ ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోధం
13,058 కోట్ల నుంచి 19,325 కోట్లకు ఆమోదం
రైతాంగం పక్షాన సీఎం రేవంత్ కు మంత్రి తుమ్మల ధన్యవాదాలు
సీతారామ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసిన తుమ్మల.
నాడు తెలుగుదేశం హయాంలో ప్రతిపాదనలకే పరిమితం
కేసీఆర్ ను సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణం కు ఒప్పించిన తుమ్మల
రేవంత్ క్యాబినెట్ లో మంత్రి గా సీతారామ ప్రాజెక్ట్ కల సాకారం చేసిన మంత్రి తుమ్మల
రాజీవ్ లింక్ కెనాల్ తో* *గోదారమ్మ కృష్ణమ్మ సంగమం
యాతాలకుంట టన్నెల్ పూర్తయితే సత్తుపల్లి కి గోదావరి నీళ్ళు
జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే పాలేరు కు సీతారామ నీళ్ళు
సీతారామ ప్రాజెక్ట్ తన జీవిత సాఫల్యం అన్న తుమ్మల
సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆగస్ట్ 15.. 2024 న సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం
తలాపునే గోదావరి పారుతున్నా….బీడు బారిన భూములు….సాగు నీటి కోసం దశాబ్దాలుగా రైతన్నల ఎదురుచూపులు.కళ్లెదుటే పంటలు ఎండిపోయి కరువు రక్కసి కోరల్లో రైతులు ఉరికొయ్యలకు వేలాడుతుంటే చలించి పోయి దశాబ్ధాల సాగునీటి కలను సాకారం చేయడానికి ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో నాడు మంత్రి గా సీతారామ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసారు తుమ్మల నాగేశ్వర్ రావు కానీ నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్ట్ ప్రతిపాదనలకే పరిమితం కాగా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తో తుమ్మల సానిహిత్యం సీతారామ ప్రాజెక్ట్ కు పునాది పడింది.కేసీఆర్ గత పాలనలో నత్తనడకన సాగిన సీతారామ ప్రాజెక్ట్ పనులు, కాంగ్రెస్ అధికారం లోకి రావడం రేవంత్ క్యాబినెట్ లో తుమ్మల మంత్రిగా ఉండటంతో మళ్లీ సీతారామ ప్రాజెక్ట్ పనులు పుంజుకున్నాయి. తన రాజకీయ జీవిత సాఫల్యం సీతారామ ప్రాజెక్ట్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమేనని మంత్రి తుమ్మల పట్టుదలగా తీసుకోగా గత ఏడాది ఆగస్ట్ 15 న సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్ట్ ప్రారంబోత్సవం చేసారు. సీతారామ ప్రాజెక్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే వరప్రదాయని.ప్రాజెక్ట్ కు ఎలా రూపకల్పన జరిగిందో చూస్తే.. తలాపునే గోదావరి పరవళ్లు తొక్కుతూ వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంటే మరోపక్క లక్షల ఎకరాలు సాగునీరు లేక బీడు పడగా,వర్షాధారంగా సాగు చేసే రైతులకు సాగు నీరు లేక కళ్లెదుటే చేతికందిన పంటలు ఎండిపోతుంటే,ఆరుగాలం రెక్కల కష్టం చమటోడ్చి సాగు చేస్తే తీరా పంట చేతికందక చేసిన అప్పులు ఎలా తీర్చేదనే బెంగతో రైతన్నలు ఉరి కోయ్యలకు వేలాడటం,పురుగు మందులు తాగి పొలంలోనే ప్రాణాలు తీసుకునే ఘటనలు ఎన్నో… నాడు తెలుగుదేశం పాలనలో జిల్లా నుంచి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు సాగు నీటి కోసం రైతుల కష్టాలు చూసి స్వయాన రైతు బిడ్డ, రైతైన తుమ్మల పదవులు శాశ్వతం కాదు పది తరాలు గుర్తుండేలా సాగు నీటి కష్టాలు తీర్చి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడానికి గోదావరి జలాలే శ్రీ రామరక్ష అని భావించి, నాడే సీతారామ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసారు.కానీ నిధులు సమస్య తో ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాలేదు. కేసీఆర్ తో తుమ్మల సానిహిత్యం…సీతారామ ప్రాజెక్ట్ కు పునాది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం జరిగి 2014 ఎన్నికల్లో తుమ్మల ఓటమి చెందారు. కానీ కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్ర అభివ్రుద్ది చెందాలంటే పాలన అనుభవం పరిపాలన దక్షత మెండుగా ఉండి,తనకు తుమ్మల ఎంతో ఆత్మీయుడవడంతో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తుమ్మల ను ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. దాంతో తుమ్మల మంత్రిగా పదవులు కంటే ప్రజాప్రయోజనం కలిగే పనులు చేయాలనే సంకల్పంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి కష్టాలు తీరాలంటే, బీడు బారిన భూముల్లో పచ్చని పంటలు పండాలంటే సాగు నీటి ప్రాజెక్ట్ ఎంతో అవసరమని,గోదావరి జలాలను లిఫ్ట్ చేసే ప్రాజెక్ట్ కు తుమ్మల తనకున్న అనుభవంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాలను ఎలా కాల్వల్లో పారించాలో తుమ్మల ప్రతిపాదనలు చేసారు. సాగు నీటి ప్రాజెక్ట్ లతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణం చేయాలనే సంకల్పంతో ఉన్న కేసీఆర్ తుమ్మల ప్రతిపాదనలకు ఆమోదం తెల్పి ప్రాజెక్ట్ పేరును శ్రీ రాముడు కొలువైన ప్రాంతం భద్రాచలం కావడంతో సీతారామ ప్రాజెక్ట్ గా కేసీఆర్ నామకరణం చేసారు. సీతారామ ప్రాజెక్ట్ కు 2016 పిభ్రవరి 16 న సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద శంకుస్థాపన చేసారు. గోదావరి నదిపై దుమ్ముగూడెం వద్ద కాటన్ నిర్మాణం చేసిన ఆనకట్ట కు దిగువన సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణం చేసి 70 టీఎంసీ ల సామర్ధ్యంతో భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా ప్రాజెక్ట్ రూపకల్పన చేసారు.సీతమ్మ సాగర్ బ్యారేజ్ 36 టీఎంసీ ల సామర్ధ్యంతో నిర్మాణం జరుగుతుండగా 320 మెగావాట్ల సామర్థ్యం తో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతుంది. గోదావరి జలాలను లిఫ్ట్ చేసి స్టోర్ చేసేందుకు రిజర్వాయర్లు నిర్మాణం చేసారు…* *ప్రాజెక్ట్ లో బీ.జీ కొత్తూరు పూసుగూడెం కమలాపురం మూడు పంప్ హౌస్ లు ఏర్పాటు చేసారు గత కేసీఆర్ ప్రభుత్వం 8 వేల కోట్లు పైగా ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఖర్చు చేసారు. గతంలో కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా తుమ్మల ఉన్న సమయంలో వారానికి ఓ సారి ప్రాజెక్ట్ పనులను మానిటర్ చేసేవారు.కానీ 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమితో సీతారామ ప్రాజెక్ట్ కు నిర్లక్ష్యం గ్రహణం పట్టింది. రెవంత్ క్యాబినెట్ లో మంత్రి గా తుమ్మల..సీతారామ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ గత కేసీఆర్ పాలనలో నత్తనడకన సాగిన సీతారామ ప్రాజెక్ట్ పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రిగా అవకాశం రావడం తో తుమ్మల మళ్లీ సీతారామ ప్రాజెక్ట్ పనులపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు.గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ను సస్య శ్యామలం చేయాలనే పట్టుదలతో మంత్రి తుమ్మల ఉన్నారు. యుద్ద ప్రాతి పదికన ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడం కోసం అధికారులతో పలు మార్లు రివ్యూ చేశారు. ఈ వానాకాలంలో సాగు నీరు ఇవ్వాలనే పట్టుదలతో వైరా లింక్ కెనాల్ కు మంత్రి తుమ్మల రూపకల్పన చేశారు.పంప్ హౌస్ మోటార్లు ట్రయిల్ రన్ తో పాటు వైరా లింక్ కెనాల్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి నిధులు మంజూరు చేయాలని కోరగా వెంటనే నిధులు మంజూరు చేశారు. గత ఏడాది జూన్ 27 న బీ.జీ కొత్తూరు వద్ద మొదటి పంప్ హౌస్ ట్రయిల్ రన్ సక్సెస్ చేసారు.మంత్రి తుమ్మల గోదావరి నీళ్లకు ప్రణమిల్లి దశాబ్దాల సాగు నీటి కల నెరవేరబోతుందని సంతొషం వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు మొదట వైరా రిజర్వాయర్ కు చేరేలా లింక్ కెనాల్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసారు. వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి నీళ్ళు వైరా రిజర్వాయర్ కు చేరి అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగు నీరు పొలాలను చేరుతుంది. ఆగస్ట్ 15 2024 న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చేసారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెం పంప్ హౌస్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభం చేసారు. సీతారామ ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం, కేసీఆర్ పాలనలో అసంపూర్తి గా మారిన సీతారామ ప్రాజెక్ట్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్న మంత్రి తుమ్మల మొదట లిఫ్ట్ లు పడావు పడకుండా వినియోగంలోకి తెచ్చి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ కు గోదావరి నీళ్ళు పారించి సాగర్ ఆయకట్టు కు భరోసా గా సీతారామ నిలిచింది. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణం చేయాలి.దాంతో నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ వద్ద మంత్రి తుమ్మల ప్రతిపాదన చేశారు.కొంత మంది సొంత పార్టీవారు అడ్డుపడ్డా రైతాంగం మేలు కోసం సీఎం రేవంత్ పెద్ద మనస్సు తో సవరించిన అంచనాలకు సీఎం రేవంత్ జులై 28 నాటి క్యాబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు. 13,058 కోట్ల నుంచి 19,325 కోట్ల నిధులు పెంచేందుకు సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపారు.
చరిత్రలో నిలిచేలా సీఎం రేవంత్ రెడ్డి….మంత్రి తుమ్మల
సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం అయ్యే దశాబ్దాల సాగు నీటి కలను సాకారం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల చరిత్రలో అభినవ భగీరథులు గా నిలుస్తారని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు…..

