ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంవిద్యార్థులకు ప్రభుత్వం అందించిన షూ పంపిణీ

విద్యార్థులకు ప్రభుత్వం అందించిన షూ పంపిణీ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి. రమేష్ దులాపురం మున్సిపాలిటీ పరిధిలోని చిన్న వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందించిన షూ ను 9వ వార్డు కౌన్సిలర్ కందుకూరి శేషమ్మ వెంకటనారాయణ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యా సామగ్రిని అందిస్తూ వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు షూ ను అందించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, మంత్రి క్యాంపు కార్యాలయం ఇన్‌చార్జి తంబురి దయాకర్ రెడ్డికి, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ భైరు హరినాథ్ బాబు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!