పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ రిపోర్టర్. ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలో ఉన్న కొండపేట గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులకు స్మశాన స్థలము లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యవసాయ కార్మిక సంఘ మండల నాయకుడు, కారు. లాజరస్ మరియు సగిలి. గురయ్యలు తెలిపారు. శుక్రవారం సామాజిక శంఖారావం అనే ఉద్యమ కార్యక్రమాన్ని కొండపేట గ్రామంలో సిపిఎం నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సమస్యల గురించి మాట్లాడగా, వారు స్మశాన స్థలం గురించి తెలియపరిచారు. మేము చనిపోయినప్పుడు పూర్వము ఏ విధముగా స్మశానానికి దారి ఉండిందో, దానిని మాత్రమే ఏర్పాటు చేయాలని, అయితే ప్రస్తుతం అది ఆక్రమణకు గురైందని , ఈ విషయంపై ఎన్నోసార్లు వీఆర్వో, ఆర్ ఐ ,తాసిల్దార్ దృష్టికి తీసుకెళ్లినా కూడా ఫలితము లేకుండా పోయిందని చెప్పారు. అయితే ప్రస్తుతం చనిపోయిన వారిని ప్రభుత్వ రహదారి వెంట తీసుకుపోయేందుకు కూడా కొంతమంది నాయకులు, రైతులు అభ్యంతరం చేస్తున్నారని, ఇట్లా అయితే మేము ఎక్కడ శవాలను పూడ్చుకోవాలని వారు తాసిల్దార్ కార్యాలయం ఎదుట డిమాండ్ చేశారు. ఈ విషయంపై గ్రామస్తులు అందరూ కలిసి వినతి పత్రం రాసి డిప్యూటీ తాసిల్దార్ మోహన్ రాజ్ కు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ,స్మశాన స్థలాన్ని పరిశీలించి , ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే సమస్య పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొండపేట గ్రామస్తులు ఇండ్ల జయరాజ్ ,మత్తయి, జకరియా, యేసు రత్నం, సుధాకర్ , మోహన్, ఇమ్మానియేల్, పోలయ్య, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
కొండపేట ఎస్సీ కాలనీవాసులకు పాత స్మశాన స్థల దారిని ఏర్పాటు చేయాలి…
RELATED ARTICLES
