ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిఉద్యమకారులకు అండగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నామ రవికిరణ్..

ఉద్యమకారులకు అండగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నామ రవికిరణ్..

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి జహీరాబాద్ జూన్ 26 2026: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో తెలంగాణ ఉద్యమకారులకు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడంలో గతంలో జరిగిన లోపాలను బిఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు సరిదిద్దుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నామ రవికిరణ్ జహీరాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ 37వ వార్డుకు చెందిన సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు తులసీదాస్ గుప్తా, రేకుల్గి సుభాష్‌ల నివాసాలకు వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో వీరు చురుగ్గా పాల్గొన్నప్పటికీ, గత ప్రభుత్వ హయాంలో వీరికి సరైన అవకాశాలు, పార్టీలో తగిన గుర్తింపు దక్కలేదనే విషయాన్ని ఈ సందర్భంగా చర్చించారు. ఉద్యమకారులను, కార్యకర్తలను గతంలో విస్మరించామని, ఇకపై ఆ తప్పును సరిదిద్దుకుని ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పేర్కొన్న విషయాన్ని నామ రవికిరణ్ వారికి గుర్తుచేశారు. పార్టీ అధిష్టానం వాస్తవాలను గ్రహించి తప్పును గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు, ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీలో తప్పనిసరిగా సముచిత స్థానం, తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. పార్టీని నమ్ముకున్న అసలైన ఉద్యమకారులను తిరిగి కలుపుకుపోయే దిశగా బీఆర్ఎస్ నాయకులు క్షేత్ర స్థాయిలో అడుగులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పెద్దబాయి మహిపాల్ యాదవ్, నామ స్రవంతి, మాజీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ యాకూబ్, మాజీ కౌన్సిలర్ అబ్దుల్లా, నియోజకవర్గ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు అగురే శివరాజ్, న్యాయవాది విశ్వనాధ్ స్వామి, వెంకట్ సాగర్, నరేష్ రెడ్డి, విశాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!